చంద్రుడిపై శివశక్తి పాయింట్ వద్ద అద్భుతం..

చంద్రయాన్ - 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. "శివ శక్తి పాయింట్‌" గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-10-27 09:33 GMT

చంద్రయాన్ - 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. "శివ శక్తి పాయింట్‌" గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాయింట్ వద్ద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ అద్భుతాన్ని చంద్రయాన్ 2కు చెందిన ఆర్బిటర్ హైరిజల్యూషన్ కెమెరా బంధించింది. ఒక సర్కిల్ ఆకారంలో ఉన్న ఈ అద్భుతం ఏమిటి.. ఎలా ఏర్పడింది.. అనే విషయాలు ఇప్పుడు చూద్దదాం!

దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజుల్లో 2023 ఆగస్టు 23వ తేదీ ఒకటి! ఆ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది.. భారత్ చంద్రుడి దక్షిణదృవంపై రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. ఆ రోజే జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. చంద్రుడి దక్షిణదృవంపై దిగి చరిత్ర సృష్టించింది. దీంతో... జయహో భారత్ అనే శబ్ధం దేశం మొత్తం ధ్వనించింది.

ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారన్ని ఇస్రో సేకరించింది. ఇందులో భాగంగా... దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ఇదే సమయంలో ప్రత్యేకించి.. సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించడంతో పాటు ప్రధానంగా.. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ సైతం ఉందనే విషయాన్ని ఇస్రో నిర్ధారించింది.

దీంతో చంద్రుడిపై మనిషి మనుగడపై మరోసారి భారత్ లో చర్చ మొదలైంది. ఆ ఉత్సాహంలో చంద్రుడిపై కొంతమంది స్థాలాలు కూడా కొనడం కొసమెరుపు. ఈ సమయంలో... ఆక్సిజన్, అల్యూమినియం, సల్ఫర్‌, క్యాల్షియం, ఐరన్, టైటానియం, క్రోమియం నిల్వలు చంద్రుడిపై ఉన్నాయని.. ఈ విషయాన్ని లిబ్స్ పేలోడ్ గుర్తించిందని ఇస్రో తెలిపింది.

అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను ప్రసారం చేయగల లిబ్స్ ను ఉపయోగించి... చంద్ర శిలలు, లేదా చంద్రుడిపై ఉన్న మట్టి లక్షణాలను తెలుసుకుంటుంది ఇస్రో. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తాజాగా జాబిల్లిపై ఉన్న శివశక్తి పాయింట్‌ వద్ద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విక్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయినప్పుడు గాల్లోకి ఎగిరిన ధూళి ఓ వలయంగా ఆవిష్కృతమైంది.

ఇలా సుమారు 108.4 మీటర్ల చదరపు విస్తీర్ణం వరకు విస్తరించిన చంద్రుడి ధూళి కణాలు... శివ శక్తి పాయింట్ మొత్తాన్నీ కవర్ చేస్తూ ఓ వలయంగా ఏర్పడింది. ఈ వలయాన్ని సాంకేతికంగా దీన్ని ఎజెక్టా హ్యాలోగా పిలుస్తామని ఇస్రో తెలిపింది. దీనికి కారణం... చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రం ల్యాండర్ దిగినప్పుడు సుమారు 2.06 టన్నుల చంద్ర ధూళి గాల్లోకి ఎగజిమ్మడమే అని పేర్కొంది.

కాగా... గతంలో అపోలో 15 ల్యాండ్ అయినప్పుడు కూడా ఇలాంటి వలయం ఏర్పడినట్లు ఇస్రో వివరించింది. దీన్ని చంద్రయాన్ 1 ఆర్బిటర్ గుర్తించినట్లు తెలిపింది.

Tags:    

Similar News