కూటమి మేనిఫెస్టోలో మార్పులు!?
కానీ, ఉచిత పథకాలకు.. ఉచితాలకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీజేపీ సూపర్ సిక్స్‌పై మెలిక పెడుతోంది.
టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడిగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఇప్పటికే ఒక మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువచ్చారు. అయితే.. ఇది కూటమిగా మూడు పార్టీలు ఏర్పడక ముందు జరిగింది. కానీ, ఆయన బీజేపీ, జనసేనతో తర్వాత.. పొత్తు పెట్టుకున్నారు. అయినా.. కూడా అదే సూపర్ సిక్స్‌ను అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ, ఉచిత పథకాలకు.. ఉచితాలకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీజేపీ సూపర్ సిక్స్‌పై మెలిక పెడుతోంది.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు.. పీయూష్ గోయెల్, అరుణ్ సింగ్, శివప్రకాశ్, రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ మధుకర్ కలుసుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సహా.. మోడీ పాల్గొనే సభలపై చర్చించారు. మొత్తంగా మోడీ రెండు నుంచి మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయా అంశాలపై చర్చించిన సమాచారం.
ఇక, ప్రధానంగా.. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అంశాన్ని ప్రధానంగా పీయూష్ గోయెల్ చర్చించా రు. ఇప్పటికే సూపర్ సిక్స్‌పై బీజేపీ రాష్ట్ర నేతలకు.. కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అయితే.. వీటిలో భారీ హామీలు ఉండడం.. ఉచితాలకు పెద్దపీట వేయడంతో.. ఇది సరికాదన్నది బీజేపీ అగ్రనాయకత్వం చెబుతున్న మాట. గతంలోనూ ఈ విషయంపై చర్చించారు. దీంతో కొన్ని రోజులు చంద్రబాబు సైలెంట్ అయ్యారు. కానీ, వైసీపీ దూకుడు ముందు.. విజయం దక్కించుకోవాలంటే.. సూపర్ సిక్స్ అవసరమని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని పదే పదే ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే.. బీజేపీ మాత్రం ఉమ్మడి మేనిఫెస్టోలో కేంద్రంలోనిబీజేపీ తెచ్చిన పథకాలనే ఎక్కువగా చేర్చాలని పట్టుబడుతోంది. అదేసమయంలో ఉచితాలను తగ్గించుకోవడంతోపాటు.. వీటిని బీజేపీ ఇస్తున్నట్టు ప్రచారం చేయొద్దని సూచిస్తోంది. ఇది కూటమిలో ఇబ్బందిగా మారింది. చంద్రబాబు మాత్రం బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.