పార్లమెంట్ వద్ద కలకలం... ఎవరు ఆ ముగ్గురూ?

అవును... నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు యత్నించారు.

Update: 2024-06-07 05:16 GMT

దేశంలో లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. పార్లమెంట్ భవనం లోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో... ఆ ముగ్గురూ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఎందుకు ఈ పనికి పూనుకున్నారు అనే విషయంపై అధికారులు ఆరతీస్తున్నారు.

అవును... నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఈ సమయలో ఆ ముగ్గురినీ సెక్యూరిటీ సిబ్బాంది పట్టుకున్నారని అధికార వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఫోర్జరీ, మోసానికి సంబంధించిన ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ సమయంలో వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఇందులో భాగంగా.. ఈ ముగ్గురు వ్యక్తులను కాసిం, మోనిస్, సోయెబ్ లుగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెళ్లడించారు. పార్లమెంట్ వద్ద రెగ్యులర్ సెక్యూరిటీ చెక్, గుర్తింపు కార్డుల చెక్కింగ్ సందర్భంగా పార్లమెంట్ హౌస్ ఫ్లాప్ గేట్ ఎంట్రీ వద్ద ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక అరెస్టైన ఆ ముగ్గురు వ్యక్తులూ పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఎంపీ లాంజ్ ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డీవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో పనిచేశారని అంటున్నారు. ప్రస్తుతం వీరిపై సెక్షన్ 465 (ఫోర్జరీ), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 120బీ (నేరపూర్తి కుట్ర), 417 (నకీలీ పత్రాన్ని నిజమైనదిగా చూపించడం) వంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం!

Tags:    

Similar News