చెన్నై మెట్రో రైల్ మరో రికార్డు.. ప్రయాణికుల కోసం సరికొత్త ప్రయోగం

దేశంలోని మెట్రో రైలు వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది.

Update: 2024-10-25 08:30 GMT

దేశంలోనూ అత్యాధునిక టెక్నాలజీ రోజురోజుకూ విస్తరిస్తోంది. దేశంలోని మెట్రో రైలు వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది. ఒకప్పుడు ఏదైనా పని నిమిత్తం కాలినడకన వెళ్లే వాళ్లం. ఆ తదుపరి జంతువుల సహకారంతో గమ్యస్థానాలకు చేరేవాళ్లం. అనంతరం సైకిళ్లు వచ్చాయి. ఆ తరువాత చిన్న చిన్న బండ్లు వచ్చాయి. అనంతరం కార్లు దర్శనమిచ్చాయి. ఇక ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు రైళ్లను ప్రవేశపెట్టాయి. బ్రిటిష్ కాలం నాటి నుంచే రైల్వే మార్గం ఉన్నప్పటికీ దానిని మన ప్రభుత్వాలు మరింత విస్తరించాయి. ఆ తరువాత లోకల్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఇక.. ట్రాఫిక్ బాధల నుంచి మరింత చెక్ పెట్టేందుకు దేశంలో మెట్రో రైలు వ్యవస్థను తీసుకొచ్చారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఈ మెట్రో వ్యవస్థను తీసుకొచ్చారు. దాంతో రోజూ వేలాది సంఖ్యలో రైళ్లు పట్టాలపై పరిగెడుతూనే ఉన్నాయి. లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూనే ఉన్నాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదురుచూసే పనిలేకుండా నిమిషాల్లోనే గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. మెట్రో రైళ్లు పరిగెడుతుండగానే దేశంలో బుల్లెట్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కళ్లు మూసి తెరిచే లోపే వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

అయితే.. ఈ రైళ్లన్నీ ఇప్పటివరకు డ్రైవర్లు నడిపిస్తేనే నడిచాయి. కానీ.. తాజాగా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పైలెట్లు అవసరం లేకుండానే లెటెస్ట్ టెక్నాలజీతో పరిగెడుతాయి. దీంతో పరిజ్ఞానంలో భారత్ అగ్ర రాజ్యాల సరసన నిలిచింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థలో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య ఈ రైలు నడుస్తోంది.

తాజాగా.. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఈ డ్రైవర్ రహిత రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని చెన్నై కూడా ఒకటి. దాంతో ఇక్కడ కూడా డ్రైవర్ రహిత రైళ్లను మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా ఈనెల 26న తొలి డ్రైవర్ రహిత రైలును టెస్ట్ డ్రైవర్ ప్రారంభిస్తోంది. పూందమల్లిలోని టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్‌లో ఈ రైళ్లను పరీక్షించబోతున్నారు. నిత్యం ట్రాఫిక్‌తో సతమతం అవుతున్న చెన్నై నగర ప్రజలకు మరింత ఊరటనిచ్చేలా మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా.. డ్రైవర్ రహిత రైళ్లను నడపనున్నారు. దీంతో మెట్రో రెండో దశ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పనులు పూర్తయి ఈ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

Tags:    

Similar News