మిచాంగ్ ఎఫెక్ట్‌: మునిగిపోయిన చెన్నై విమానాశ్ర‌యం

"మిచాంగ్" తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. తుఫాను ప్ర‌భావం త‌మిళ‌నాడుపై ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా రాజ‌ధాని చెన్నై న‌గ‌రాన్ని తుఫాను వ‌ణికిస్తోంది.

Update: 2023-12-04 11:12 GMT

"మిచాంగ్" తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. తుఫాను ప్ర‌భావం త‌మిళ‌నాడుపై ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా రాజ‌ధాని చెన్నై న‌గ‌రాన్ని తుఫాను వ‌ణికిస్తోంది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు స‌హా.. అన్ని న‌గ‌రాలు కూడా జ‌ల‌మ‌యమ‌య్యాయి. ముఖ్యంగా చెన్నైలోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో మోకాల్లోతు నీరు చేరింది. దీంతో విమాన రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. మ‌రోవైపు.. న‌గ‌రం అంతా రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు.

ఈ తుఫానుతో ఏపీకి కూడా భారీ ముప్పు పొంచి ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. తీవ్ర తుఫాను నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. పాండిచ్చేరికి ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 320 కి.మీ దూరంలో తీరం దాటనుంది.

తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్ర మంలో తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరిక ల కేంద్రం తెలిపింది. మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. హుటాహుటిన క‌లెక్ట‌ర్‌ల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది.

Tags:    

Similar News