చైనాలో అంతే: ఈసారి రక్షణ మంత్రి గాయబ్.. ఏమైనట్లు?

తాజాగా చైనాలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ మీటింగ్ జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరుకావాల్సిన రక్షణ మంత్రి పత్తా లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2023-09-17 04:47 GMT

ప్రపంచంలోని పెద్ద దేశాల లెక్క వేరు. చైనా పాలకుల తీరు వేరు. దేశాధ్యక్షుడి కనుసన్నల్లో ఒదిగిపోయి ఉండే దేశంగా డ్రాగన్ దేశం కనిపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ విమర్శల్ని.. ఆరోపణల్నిపెద్దగా పట్టించుకోకుండా తమ స్కూల్ తరహాలో పాలన సాగించే విచిత్రమైన ధోరణి జిన్ పింగ్ ప్రభుత్వంలో దర్శనమిస్తుంటుంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా.. అధ్యక్షుల వారికి ఆగ్రహం వస్తే చాలు.. సదరు ప్రముఖుడు కనిపించకుండా పోవటం ఒక అలవాటుగా మారింది. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది.

చైనా అధ్యక్షుడిగా సీ జిన్ పింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అటు రాజకీయ రంగం కావొచ్చు.. ఇటు పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు కావొచ్చు.. ఆ మాటకు వస్తే ఎవరైనా కావొచ్చు. హటాత్తుగా కనిపించకుండా పోవటం ఒక అలవాటుగా మారింది. తాజాగా ఆ జాబితాలో చేరారు చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగుపూ.

గడిచిన రెండు వారాలుగా ఆయన కనిపించకుండా పోయారు. దేశ రక్షణ మంత్రి స్థాయిలో ఉండి కూడా కనిపించకపోవటం ఏమిటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ ఈ అంశంపై చైనా నోరు విప్పట్లేదు.

మేలో దేశ విదేశాంగ మంత్రి హటాత్తుగా కనిపించకుండాపోవటం.. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆయన కనిపించారు. అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ చైనాకు వచ్చిన సందర్భంగా దేశ విదేశాంగ మంత్రి కనిపించలేదు. ఈ వ్యవహారం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల తర్వాత గాంగ్ స్థానంలో వాంగ్ యికికి బాధ్యతలు అప్పజెప్పారు.

తాజాగా చైనాలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ మీటింగ్ జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరుకావాల్సిన రక్షణ మంత్రి పత్తా లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది.మరి.. ఆయన ఎప్పటికి బయటకు వచ్చి కనిపిస్తారో? ఇంతకూ ప్రముఖులు కనిపించకుండా పోవటం వెనుక అసలేం జరుగుతుందన్నది ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News