"జగన్ కు బైండింగ్ వైర్ తగిలింది.. వెల్లంపల్లికి జగన్ గుద్దిదే తగిలింది"!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా

Update: 2024-04-15 09:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా.. శనివారం విజయవాడలో ఒక ఆగంతకుడు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నుంచి పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతల వరకూ ఆ విషయాన్ని ఖండించారు కూడా! ఈ సమయంలో టీడీపీ నేతలు పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇందులో భాగంగా... వైఎస్ జగన్ పై దాడిలో పలు అనుమానాలున్నాయని.. కావాలనే దాడి చేయించుకున్నట్లు తెలుస్తుందని.. సానుభూతి నాటకానికి సీఎం జగన్‌ తెర తీశారని రకరకాల కామెంట్లు ఈ సందర్భంగా టీడీపీ నేతల నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికలుగా వినిపిస్తున్నాయి! ఈ సమయంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడిపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు!

అవును... సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడిపై తాజాగా చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... గాయమైన మూడు గంటల వరకూ ఎందుకని హాస్పటల్ కు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో... దండ వేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుని ఆ గాయం అయినట్లు ఒక వెర్షన్ ఉందని తెలిపారు. వీటిలో ఏది నిజమని ప్రశ్నించారు.

ఇలా బైండింగ్ వైర్ తగిలి గాయం అవ్వడంతో కోపంలో జగన్ మోచేతితో గుద్దిదే వెల్లంపల్లి శ్రీనివాస్ కు గాయం అయినట్లు కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయని చెప్పిన చింతమనేని... వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రే అని తెలిపారు. తాను క్షేమంగా ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... జగన్ కి నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ వాపు రావాలని, బొప్పి కట్టాలని చెప్పిన చింతమనేని... ఇదంతా కోడికత్తి డ్రామాలో ఎలాంటి గీత ఉందో.. ఇప్పుడు కూడా అలాంటి గీతే ఉందని తెలిపారు. రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ... మూడు విధాలుగా గీసుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తనకు ఎలా గాయం తగిలిందో సీఎం చెప్పాలని కోరారు.

ఈ సమయంలో... స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాదిరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం కాదని అన్నారు. జగన్ బస్సు యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నేతలే ఈ దాడులు చేయించారని అంటున్నారని... అయితే.. ఇదంతా మీ డైరెక్షన్ లోనే మీరే చేయించుకున్నారని ప్రజలు అంటున్నారని.. ఫలితంగా సింపతీ పోందాలని చూస్తున్నారని ప్రజలు చింతమనేని చెప్పుకొచ్చారు.

Full View
Tags:    

Similar News