జనసేనలోకి అన్నయ్య...?

ఎన్నికలు దగ్గరలో ఉన్న వేళ చిరంజీవి తమ్ముడికి అండగా జనసేన తరఫున ప్రచారం చేస్తారా అంటే అవును అని కూడా వినిపిస్తోంది

Update: 2023-08-08 14:15 GMT
జనసేనలోకి అన్నయ్య...?
  • whatsapp icon

జనసేన పార్టీని పవన్ 2014లో పెట్టి ఒంటరిగానే నడుపుకుంటూ వస్తున్నారు. తొలి అయిదేళ్లూ ఆయన సోలోగానే పొలిటికల్ ఫైట్ ఇచ్చారు. 2019 నాటికి మెగా బ్రదర్ నాగబాబు తోడు అయ్యారు. 2019 ఎన్నికలో నాగబాబు నర్సాపురం లోక్ సభ సీటుకు పోటీ చేసి ఓడారు.

ఇక ఆయన జనసేనలో ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు. 2024లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ఏకంగా మెగా స్టారే జనసేనకు అండగా రంగంలోకి దిగుతారా అన్న చర్చలు అయితే చాలా కాలంగా నడుస్తూ వస్తున్నాయి. అయితే దానికి కొంత ఊపు వచ్చేలా ఇటీవల కాలంలో పరిణామాలు జరుగుతున్నాయి.

ఈ మధ్యనే జరిగిన చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆది వేదిక మీద మాట్లాడిన మాటలు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటూ చెప్పిన విషయాలూ అన్నీ చూసిన వారికి చిరంజీవి పవన్ కి పూర్తి సపోర్ట్ గా ఉంటారు అని భావించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆ విషయం మీద మరింత క్లారిటీ వచ్చేసింది

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా అంటూ ఎక్కడో గట్టిగా గుచ్చేశారు. గత నాలుగేళ్ళుగా విపక్షాలు ఏపీ రోడ్లు బాగులేవు అంటూ చేస్తున్న కామెంట్స్ కి చిరంజీవి ఒకే డైలాగ్ తో కొట్టాల్సిన దెబ్బ కొట్టారు. రోడ్లు బాగు చేయవచ్చు కదా అన్నారు. మౌలిక సదుపాయాలు డెవలప్ చేయవచ్చు కదా అని సూచించారు.

అంతే కాదు, ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఇలా ఏపీ ప్రభుత్వం గురించి నాలుగైదు మాటలలోనే నిశితంగా విమర్శించారు ఇదే ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి మెగా రూట్ మార్చేస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్న వేళ చిరంజీవి తమ్ముడికి అండగా జనసేన తరఫున ప్రచారం చేస్తారా అంటే అవును అని కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలు సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు తామంతా పవన్ వెంటే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇపుడు మెగా ఫ్యామిలీ పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి పాలిటిక్స్ గురించి టచ్ చేసి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపారు. నిజానికి చిరంజీవి 2014 తరువాత ఏపీ పాలిటిక్స్ గురించే కాదు అసలు పాలిటిక్స్ మీదనే ఫోకస్ పెట్టలేదు.

ఇపుడు ఆయన మాట్లాడుతున్నారు అంటే జనసేనను ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలన్న ఆలోచనతోనే అని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో విపక్షంలో టీడీపీ ఉంది. టీడీపీకి అనుకున్న స్థాయిలో గ్రాఫ్ పెరగడంలేదు. దాంతో పాటు మూడవ పార్టీగా రంగంలోకి జనసేన వస్తోంది.

పవన్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కానీ టోటల్ అన్ని సెక్షన్ల నుంచి మద్దతు దొరకాలీ అంటే మెగా స్టార్ లాంటి బిగ్ ఫిగర్ రంగంలోకి వస్తే మాత్రం అది కచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. మరి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి వస్తారా అన్నదే ఇక్కడ ఒక కీలక ప్రశ్న. అలా కాకుండా పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 2009 మాదిరిగా టోటల్ మెగా ఫ్యామిలీ ఏపీని చుట్టేస్తారు అని అంటున్నారు.

గతానికి ఇప్పటికీ వచ్చిన అనుభవంతో పాటు ప్రజల నాడిని అనుకూలంగా మలచుకుని ఏపీలో జనసేన జెండా ఎగరవేయడానికి మెగా సపోర్ట్ ఇపుడు అవసరం అంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పటిదాకా న్యూట్రల్ గా ఉన్న మెగా స్టార్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వేళ జనసేన క్యాడర్ లో ఉత్సాహం పొంగి పొరలుతోంది. మరి రానున్న రోజుల్లో అన్నయ్య జనసేనకు అండగా నిలుస్తారు అంటూ వారంతా ఫుల్ జోష్ లో ఉంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News