కుంభమేళ సిత్రాలు: 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. తలపై బార్లీ సాగు

అలాంటి ఇద్దరికి చెందిన విశేషాల్ని చూస్తే.. వీరిలో ఒక బాబా గత 32 ఏళ్లుగా స్నానమే చేయలేదు.

Update: 2025-01-05 10:30 GMT

మహా కుంభమేళ కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బాబాలు.. సాధువులు.. అఘోరాలు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా కొందరు బాబాలు.. సాధువులు అమితంగా ఆకర్షిస్తుంటారు. అలాంటి ఇద్దరికి చెందిన విశేషాల్ని చూస్తే.. వీరిలో ఒక బాబా గత 32 ఏళ్లుగా స్నానమే చేయలేదు. మరో బాబా తల మీద ఏకంగా బార్లీని పండిస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

32 ఏళ్లుగా స్నానం చేయని బాబా పేరు ఛోటూ బాబా. ఆయన అసలు పేరు గంగాపురి మహరాజ్. అసోంలోని కామాఖ్య పీఠానికి చెందిన ఆయన ఎత్తు కేవలం 3.8 అడుగులు మాత్రమే. ఆయన వయసు 57 ఏళ్లు. గడిచిన 32 ఏళ్లుగా ఆయన స్నానం చేయలేదు. తానో కోరిక కోరుకున్నానని.. అది తీరే వరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెప్పిన ఆయన.. తన కోరిక ఏమిటో మాత్రం వెల్లడించలేదు.

ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుందని.. అందుకే తాను మహా కుంభమేళకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సాధువుగా మారి గడిచిన ఐదేళ్లుగా తలపై బార్లీ సాగు చేస్తున్న ధాన్ వాలే బాబా సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉంటారు. ఆయన తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే ప్రయాగ్ రాజ్ లో ఆయన ప్రముఖంగా కనిపిస్తారు. ఆయన్ను అందరూ గుర్తిస్తారు. ఆయన అసలు పేరు అమర్ జీత్. కెమికల్స్ తో పండించిన ఆహార పదార్థాలతో మనుషుల అనారోగ్యం పాలవుుతన్నారని.. అందుకే ప్రకృతి సిద్ధమైన సాగు మీద అవగాహన కల్పించటం కోసం ఆయనీ విచిత్రమైన పని చేస్తుంటారు. తల మీద బార్లీ సాగు చేసే ఆయన.. పడుకునే విధానం ఎలా ఉంటుందన్న సందేహం పలువురికి వస్తుంది.

Tags:    

Similar News