ఆ గొడవపై 30 ఇయర్స్ పృథ్వీ జగన్ కలిస్తే..

‘ఖడ్గం’ మూవీతో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో పాపులర్ అయి తెలుగు చిత్రాల్లో తర్వాతి కాలంలో బిజీ కమెడియన్‌గా ఎదిగిన నటుడు పృథ్వీ.

Update: 2024-02-13 16:30 GMT

‘ఖడ్గం’ మూవీతో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో పాపులర్ అయి తెలుగు చిత్రాల్లో తర్వాతి కాలంలో బిజీ కమెడియన్‌గా ఎదిగిన నటుడు పృథ్వీ. ‘లౌక్యం’ సినిమా తర్వాత ఒక టైంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాలీవుడ్ నంబర్‌వన్ కమెడియన్‌ హోదాను అనుభవించాడు పృథ్వీ. కానీ అతడి మహర్దశ కొంత కాలమే నడిచింది. చూస్తుండగానే డౌన్ అయ్యాడు.

ఆ తర్వాత రాజకీయాల మీద దృష్టిపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసే క్రమంలో సినిమాలకు దూరమయ్యాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల నుంచి నడిచే ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా పని చేస్తూ కొంత కాలం హవా నడిపించిన ఆయన.. ఓ మహిళతో శృంగార సంభాషణ తాలూకు ఆడియో ఒకటి రిలీజ్ కావడంతో అన్‌పాపులర్ అయి పదవి కోల్పోయాడు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూడా బయటికి వచ్చేయాల్సి వచ్చింది.

ఈ మధ్యే జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకే ప్రచారం చేయబోతున్న పృథ్వీ.. తాను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉండగా తలెత్తిన వివాదం తర్వాత ఏపీ సీఎం జగన్‌ను భార్యతో కలిసి మాట్లాడిన సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉండగా బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తుండడంతో కొందరు తట్టుకోలేకపోయారు. వివాదాలు సృష్టించారు. నా మీద ఆరోపణలు వచ్చినపుడు అందరూ ఒక వైపే చూశారు. నా భార్య నాకు అండగా నిలిచింది. ఆమెతో కలిసి ముఖ్యమంత్రిని కలిశాను.

‘మా వారు అలా చేయలేదని నాకు తెలుసు. ఆయన తప్పు చేసి ఉంటే ఇప్పటికిప్పుడే పోలీసులకు అప్పగిస్తా’ అని సీఎంకు నా భార్య చెప్పింది. ఆయనేమో ‘మాట్లాడదాం అమ్మా’ అంటూ ఏదో చెప్పబోయారు. ఇక ఇవన్నీ వద్దు సార్ అని నమస్కారం పెట్టి బయటికి వచ్చేశాం. ఆ వెంటనే రాజీనామా చేశాను. తర్వాత ఆ పార్టీలో ఇమడలేకపోయాను. కరోనా సెకండ్ వేవ్‌లో నాకు వైరస్ సోకితే ఆసుపత్రిలో బెడ్ కావాలని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. అప్పుడు నాగబాబు గారు, సాయికుమార్ గారు స్పందించారు. ఇండస్ట్రీనే నన్ను కాపాడింది’’ అని పృథ్వీ చెప్పాడు.

Tags:    

Similar News