మాజీమంత్రి విడదల రజినీ వేదిస్తున్నారంటూ ఫిర్యాదు!
అవును... టీడీపీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్ లో మాజీమంత్రి విడదల రజనీపై కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
మాజీమంత్రి విడదల రజినీపై తాజాగా ఓ ఫిర్యాదు అందింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఈ మేరకు పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన కోటయ్య అనే వ్యక్తి.. మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రజినీ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాట్లు చెబుతూ, వాటిని వెల్లడించారు.
అవును... టీడీపీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్ లో మాజీమంత్రి విడదల రజనీపై కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వం హయాంలో విడదల రజినీ తన మరిది గోపీనాథ్ పేరుతో తమ దగ్గర మూడు ఎకరాల భూమి కొన్నారని.. దానికి సంబంధించి ఇంకా రూ.25 లక్షలు చెల్లించకుండా రేపు, మాపు అంటూ వేధిస్తున్నారని తెలిపాడు.
ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం స్వీకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీ.ఎన్.ఎస్.ఎఫ్. అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ లు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరికొన్ని పరిష్కారాల కోసం ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజానికం వినతిపత్రాలతో తరలి వచ్చారని తెలుస్తోంది. తమపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులుపెట్టారని, వాటిని తొలగించాలని కొంతమంది కోరితే.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంకొంతమంది తమ వినతిపత్రాలు అందజేశారు. ఇదే సమయంలో తమ పెన్షన్లు రద్దు అయ్యాయని.. వాటిని పునరుద్దరించాలని ఇంకొంతమంది కోరారు!
ఇదే క్రమంలో... నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, దగదర్తి గ్రామానికి చెందిన పవన్ కుమార్... టీడీపీ వాళ్లమనే కక్షతో తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో... సుమారు 40 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పొలాన్ని కొంతమంది కబ్జా ఏశారని, పొలంలో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లాకు చెందిన మహిళ విజయనిర్మల ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి విడదల రజనీపైనా ఫిర్యాదు చేశారు. ఆమె వేదిస్తున్నారని ఆరోపిస్తూ గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇచ్చారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి!