విపక్షం హాట్ ఫేవరేట్ రాహుల్....ప్రధాని అవుతారా...?

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మా అందరి ఫేవరేట్ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి రెండవ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2023-07-18 17:46 GMT

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మా అందరి ఫేవరేట్ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి రెండవ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ లీడర్ షిప్ క్వాలిటీస్ మీద గతంలో పెద్దగా నమ్మకం లేని విపక్షాలు ఇపుడు మాత్రం ఆయన్ని బాగా తలుస్తున్నాయి.

దీనికి ముందు పాట్నాలో జరిగిన విపక్ష కూటమి తొలి భేటీలో సైతం రాహుల్ గాంధీ పట్ల పూర్తి ఆప్యాయతను కనబరచారు జేడీయూ అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్. రాహుల్ ని పెళ్ళి చేసుకోమని కూడా ఆయన సలహా ఇచ్చారు. అమ్మను బాధ పెట్టకు అని కుటుంబ పెద్దగా సలహా ఇచ్చారు. అలా రాహుల్ పట్ల తమ ప్రేమను లాలూ చాటుకుంటే ఇపుడు మమత బెనర్జీ వంతు అంటున్నారు.

ఆమె బెంగళూరు మీటింగులో రెండవ రోజున వేదిక మీద సోనియా గాంధీ పక్కనే కూర్చుని ఆమెతో చాలా విషయాలు ముచ్చటించారు. ఒక విధంగా ఈ ఇద్దరు మహిళా నేతల మంతనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాంగ్రెస్ ఓ పుట్టి పెరిగి అదే కాంగ్రెస్ ని విభేదించిన మమత తరువాత కాలంలో పశ్చిమ బెంగాల్ సీఎం గా ఎదిగారు. ఆమె యూపీయేలోనూ ఎన్డీయేలో కూడా పనిచేశారు.

ఇపుడు ఇండియా అంటూ కొత్త పేరుతో వస్తున్న కూటమిలోనూ కీలకంగా ఉన్నారు. ఆమె తన ప్రసంగంలో రాహుల్ గాంధీని తెగ పొగిడారు. ఇదంతా చూస్తూంటే విపక్ష నేతలకు రాహుల్ గాంధీ మీద ఉన్న పప్పు అన్న దురభిప్రాయం పోయిందా అన్న చర్చ సాగుతోంది. అదే టైం లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని త్యాగం చేస్తూ విపక్ష కూటమి బలపడాలని కోరుకోవడంతో కీలక విపక్ష నేతలు అంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీని పొగుడుతూ వారికి అనుకూలంగా మాట్లాడడం కూడా ఇక్కడ గమనార్హం అంటున్నారు.

అంటే రేపటి రోజున అన్నీ ఫలించి విపక్ష కూటమి అధికారంలోకి వస్తే తమ పేరుని ప్రధాని పదవిని కాంగ్రెస్ పెద్దలు సిఫార్సు చేస్తారని అలా చేయాలని ఆశతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రాహుల్ గాంధీతో చాలా సాన్నిహిత్యంగా ఉంటూ కనిపించారు.

కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ ఎపుడైతే పదవీత్యాగం అన్న మాట వాడిందో విపక్షాలకు ఆ పార్టీ అపుడే హాట్ ఫేవరేట్ అయిపోయింది అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేనే లేదని అంటున్నారు. ఎన్నికల్లో అంతా కలసి సవ్యంగా ఒకే త్రాటి మీదకు వచ్చి పనిచేయడానికి కూటమి సరైన దిశలో సాగడానికే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసింది అని అంటున్నారు.

రేపటి ఎన్నికల్లో కూటమిలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయి. కచ్చితంగా వంద దాటి కాంగ్రెస్ ఎంపీలను తెచ్చుకుంటుంది. మరి కనీసం యాభై ఎంపీలు అయినా విపక్ష కూటమిలో మరే పార్టీకి రాని సీన్ ఉంటుంది. అపుడు సోనియా గాంధీ తన కుమారుడే ప్రధాని అన్న అసలైన వ్యూహాన్ని కచ్చితంగా బయటకు తీస్తారని అంటున్నారు.

ఇప్పటికి అయితే కాంగ్రెస్ ని రాహుల్ సామర్థ్యాన్ని పొగుడుతున్న వారు అంతా అపుడు ఏ విధంగానూ కిక్కురుమనలేని పరిస్థితి ఉంటుంది అలా కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగానే ఇది చూస్తున్నారు. ఇక మమతకు ప్రధాని పదవి కాంగ్రెస్ ఎలా ఇస్తుంది అన్న ప్రశ్న ఉంది. అలాగే కేజ్రీవాల్ వంటి జూనియర్ కి సైతం దక్కకపోవచ్చు. ఒకవేళ కూటమి నుంచే అభ్యర్థి అనుకున్నా ఇపుడు రేసులో ఉన్న వారెవరూ కూడా ఊహించని ఆశించని వ్యక్తే ఆనాడు తెర ముందుకు వస్తారని అంటున్నారు.

Tags:    

Similar News