జగన్‌కు కాంగ్రెస్ కూటమి రాయబారం.. ఔనా.. నిజమా.. !!
ముఖ్యంగా తాడేపల్లిలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయబారం మొదలైనట్టు తెలుస్తోంది.
ఇదొక సంచలన విషయం. సంచలన వ్యవహారం కూడా. అయితే.. రాజకీయాల్లో శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఎలానూ ఉంది కాబట్టి.. పాలిటిక్స్‌లో ఎలాంటి పరిణామాలైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇప్పుడు ఇలాంటి ఒక సంచలన వ్యవహారమే ఏపీలో గుసగుసగా మారింది. ముఖ్యంగా తాడేపల్లిలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయబారం మొదలైనట్టు తెలుస్తోంది. దీనిని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే చెబుతున్న నాయకుడు అంత బలమైన నేత!.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి వచ్చి తీరాల్సిన అగత్యం కాంగ్రెస్‌కు ఏర్పడింది. ఇప్పటికే పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోవ డం.. మోడీ, అమిత్‌షాల దెబ్బకు పార్టీ తీవ్ర ఆపశోపాలు.. కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా.. అవకాశం కోల్పోతే.. మరో ఐదేళ్లకు పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా అయినా మారొచ్చు..లేదా మోడీ షాలు చెబుతు న్నట్టుగా.. బైనాక్లియర్‌లో చూసే పరిస్థితికి చేరుకోవచ్చు. అందుకే ఏం చేసైనా కూడా.. కేంద్రంలో అధికారంలోకి రావాలని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ.. ఏపీలోనూ కూడా.. కీలక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
తమకు కలిసి వస్తామంటే.. ఒక్క ఎంపీ ఉన్న పార్టీకి అయినా.. పెద్దపీట వేయాలని కూటమి భావిస్తోంది. ఇదేసమయంలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఏపీలో తమకు బద్ధ శత్రువైనా కూడా..వైసీపీతో చేతులు కలపాలని ఇండియా కూటమి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అత్యంత సీనియర్ నాయకుడు.. వైఎస్‌కు ఆత్మీయ బంధువు వంటి నాయకుడు.. సీఎం జగన్‌కు కూడా కావాల్సిన నేతతో ప్రత్యేక రాయబారం అత్యంత రహస్యంగా సాగించినట్టు తెలుస్తోంది. ''మీరు మాతో నేరుగా కలవొద్దు. కానీ, మాకు మద్దతివ్వండి. మిగిలింది మేం చూసుకుంటాం'' అని సదరు ఆత్మీయ నాయకుడు చెప్పినట్టు తాడేపల్లి వర్గాల్లో అత్యంత విశ్వసనీయ నేత ఒకరు లీకు ఇచ్చారు.
అంతేకాదు.. ఇక్కడ ఆత్మీయ నేత మరో సెంటిమెంటును కూడా ప్లే చేసినట్టు తెలిసింది. ''మీరు ఎంతో నమ్మారు.అనేక రూపాల్లో మద్దతిచ్చారు.కానీ, బీజేపీ మీ వైరి పక్షంతో చేతులు కలిపింది. ఇప్పుడు మీరు మాకు మద్దతివ్వండి. మీకు ఏం చేయాలన్నా.. మేం అధికారంలోకి రాగానే చేసి పెడతాం'' అని చెప్పినట్టు కూడా తెలిసింది. ఇక, వైసీపీ ఏం చేస్తుందనేది దీనిపై తేలాల్సి ఉంది. అయితే..ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం.. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా..తాము సహకరిస్తామని.. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఇండియా కూటమికి మొగ్గు చూపుతుందా? అనేది ప్రశ్న.