పీసీసీ చీఫ్ గా షర్మిలకు కాంగ్రెస్ భారీగానే ఇస్తోంది...!
ఇక ప్రాంతీయ పార్టీలలో టీడీపీ ఆం ఆద్మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా వేతనాలు తమ పార్టీ నాయకులకు ఇచ్చే పదవులను బట్టి ఇస్తూంటాయి.
ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధినాయకత్వం భారీగానే ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చబోతోంది అని తెలుస్తోంది. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్లకు జాతీయ పార్టీలు నెలకు వేతనాలు చెల్లిస్తాయి. కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టు పార్టీలలో కూడా జీతాల చెల్లింపు విధానం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలలో టీడీపీ ఆం ఆద్మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా వేతనాలు తమ పార్టీ నాయకులకు ఇచ్చే పదవులను బట్టి ఇస్తూంటాయి.
ఇక కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఇచ్చే వేతనం నెలకు రెండు లక్షలుగా ఉంటుందిట. అదే విధంగా ఆమెకు ఇతర సౌకర్యాలు మళ్లీ అదనంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ కి రెండు కార్లు కేటాయిస్తారు. వాటికి నలుగురు డ్రైవర్లు ఉంటారు.
ఇక పీసీసీ చీఫ్ హోదాలో దేశవ్యాప్తంగా షర్మిల ఎక్కడికి వెళ్లినా విమాన ఖర్చులు, బస భోజనంతో పాటు ఆమెతో పాటు ఉండే పీఏ ఖర్చును కూడా పార్టీనే ఇస్తుందని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ ఉన్న రాష్ట్రంలో రాజధానిలో ఉన్నత శ్రేణి భవనానికి కూడా పార్టీ అద్దె కడుతుంది. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కూడా చెల్లిస్తుంది. దీంతో పాటు సొంత పార్టీ కార్యాలయం పెట్టుకుంటే దాని అద్దెను కూడా పార్టీనే కడుతుంది అని అంటున్నారు.
ఇలా చూసుకుంటే మొత్తంగా ఒక పీసీసీ చీఫ్‌కు నెలకు పార్టీ పెట్టే ఖర్చు రూ.5 లక్షలకు మించకూడదని పార్టీ రాజ్యాంగం పేర్కొంటోంది. ఇవన్నీ ఇప్పుడు షర్మిలకు వర్తిస్తాయన్న మాట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరాక షర్మిలకు హోదాతో పాటు ఆర్ధికంగా కూడా బాగానే ఉంటుందని సదుపాయాలు కూడా బాగా ఉంటాయని అంటున్నారు.
మరి కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత అయితే షర్మిల మీద ఉంది. ఆమెకు కాంగ్రెస్ పదవి ఇచ్చి నెలకు జీతంతో పాటు అనేక సదుపాయాలు కల్పిస్తున్న నేపధ్యంలో పార్టీకి ఆమె కూడా ఏదో అభివృద్ధి చూపించాల్సి ఉందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే షర్మిల ముందు టఫ్ టాస్క్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆమె ఏ విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని వెళ్తారో.