ఈ ఐక్యత కొనసాగితే.. కాంగ్రెస్‌దే తెలంగాణ!
అయితే.. గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే.. పదవుల కోసం కొట్లాటలు.. పంతాలకు పోయిన కారణంగానే పార్టీ చిన్నాభిన్నమైంది.
ఒక్క గెలుపు.. అనేక కారణాలకు దారితీస్తుంది. అదేవిధంగా.. నిన్న మొన్నటి వరకు ఏముందిలే.. ఏం చేస్తారులే.. పదవుల కోసం కోట్లాటతోనే కాలం గడిపేస్తారులే.. అనుకున్న నాయకులు కలిసి కదిలితే.. ఏం జరుగుతుందో తెలంగాణ నిరూపించింది. దండలో దారం మాదిరిగా వ్యవహరించిన నాయకుల కృషి.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్న రాష్ట్రంలో అనూహ్యమైన విజయాన్ని అందించింది.
అయితే.. గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే.. పదవుల కోసం కొట్లాటలు.. పంతాలకు పోయిన కారణంగానే పార్టీ చిన్నాభిన్నమైంది. ఈ తప్పుల నుంచి తనను తాను సరిచేసుకుంటూ.. నాయకులు ఉమ్మడిగా నిలబడి.. ఒక్కుమ్మడిగా చేసిన పోరాటం.. అన్ని విధాలా కలిసి వచ్చింది.అయితే.. ఈ గెలుపు ఇక్కడితో ఆగిపోకుండా ఉండాలంటే.. మున్ముందుకూడా ఇంతే సమష్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
రో మూడు మాసాల్లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు జరిగే.. ఈ ఎన్నికలు కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి అత్యంత ముఖ్యం. అంతేకాదు.. కేంద్రంలో అధికారంలోకి రావాలని తపిస్తున్న పార్టీకి.. తమకు ఐకాన్ లీడర్‌గా ఉన్న రాహుల్‌కు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. సో.. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకోవాలంటే.. మున్ముందు చేయాల్సి కూడా సమష్టి కృషి మాత్రమేనని అంటున్నారు పరిశీలకులు.
పదవుల కోసం కొట్లాటలు.. అధికారంకోసం.. ఆరాటాలు తగ్గించుకుని. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా నాయకులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సాధించిన దానికి సంతృప్తి చెందకుండా.. మరింత చైతన్యంతో తెలంగాణ సమాజాన్ని.. ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి ఇప్పుడు వచ్చింది.. అధికారంలోకి వచ్చేంత మెజారిటీ మాత్రమే తప్ప.. తెలంగాణ సమాజం పూర్తిగా.. ఏకపక్షంగా కాంగ్రెస్‌కుమద్దతు ఇవ్వలేదు. ఈ విషయాన్ని గుర్తించి నాయకులు కలిసి పనిచేస్తేనే భవిత బాగుంటుందని.. ఎప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ చేతిలోనే ఉంటుందని చెబుతున్నారు.