లిప్ కిస్ లతో కొత్త వ్యాధులు.. ఇలాగైతే మరి రోమాన్స్ ఎలాగయ్యా?

ఓ ప్రియుడు, ప్రియురాలు కలిసినా.. భార్యాభర్తల మధ్య లిప్ కిస్‌లు సాధారణం.

Update: 2024-09-06 16:30 GMT

ఓ ప్రియుడు, ప్రియురాలు కలిసినా.. భార్యాభర్తల మధ్య లిప్ కిస్‌లు సాధారణం. ప్రస్తుత జనరేషన్‌లో లిప్‌లాక్ ల గురించి తెలియని వారు లేరు. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం.. సెల్‌ఫోన్లు ఇష్టారాజ్యంగా వాడడం, సినిమాలు చూస్తుండడంతో స్కూల్‌కు వెళ్లే పిల్లల కూడా లిప్ కిస్‌లపై అవగాహన వచ్చేసింది.

అయితే.. ఈ లిప్ కిస్ చేసుకోవడం వల్ల ఎంతో ఎంజాయ్ చేస్తారు. లిప్ కిస్ మనసుకు కూడా ఎంతో హాయినిస్తుందనేది వాస్తవం. ఒత్తిళ్లు, ఆందోళనలు తొలగిపోయి ఆ వెంటనే రిలాక్స్ మూడ్‌లోకి మారిపోవడం సాధారణం. ఎన్ని టెన్షన్లు ఉన్నా.. భాగస్వామిని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే అన్నీ తొలగిపోతాయి.

అయితే.. ఈ లిప్ కిస్‌తో ఎంత మేలు ఉందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో దుష్పరిణామాలు ఉన్నాయట. ఈ ముద్దు వల్ల లాభాలతోపాటే నష్టాలూ ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేంటి.. ముద్దుతోనే వ్యాధులు వస్తాయా అని అనుకుంటున్నారా..? వైద్యులే చెబుతున్నారంటే నమ్మాల్సిందే కదా..! ముద్దు వల్ల కలిగే నష్టాలేంటో ఒకసారి తెలుసుకుందాం.

సాధారణంగా నోటిలో బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ. లిప్ కిస్ పెట్టుకోవడం వల్ల నోటిలోని లాలాజలం ద్వారా అది వేరే వాళ్లకు సంక్రమిస్తుంది. దాని వల్ల ఒకరి రోగాలు ఒకరికి సోకే ప్రమాదాలూ లేకపోలేదని వైద్యులు సూచిస్తున్నారు. దానినే ‘మోనోన్యూక్లియోసిస్ లేదా ముద్దు వ్యాధి’ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు.

అయితే.. ఇది ఒక కూడా ఒక వైరస్ ఇన్ఫక్షన్ అని వైద్యులు చెబుతున్నారు. వైరస్ ఎలా అయితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందో.. దీని పరిస్థితి కూడా అదే అని సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా 15 నుంచి 24 ఏళ్ల వారిలో ఎక్కువగా వెలుగు చూశాయట. ఇలాంటి వైరస్ సోకిన వారిని కిస్ చేసినా.. వారి వస్తువులు టచ్ చేసినా ఈ వ్యాధి సోకుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి సోకితే కండరాల నొప్పి తీవ్రంగా ఉంటుందట. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. మోనోన్యూక్లియోసిస్ వ్యాధి ఉన్న వారికి నిత్యం తలనొప్పి, అలసట వస్తుందని.. వీటిలో ఏ లక్షణం కనిపించినా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో కొందరికి వెంటనే లక్షణాలు కనిపిస్తే.. మరికొందరికి మాత్రం నెల రోజులకు బయటపడుతాయని చెప్పారు.

వైరస్‌ల వల్ల అనారోగ్యం పాలవ్వడం సాధారణం. అందుకే.. డాక్టర్లు సూచించిన పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. అంతేకాదు.. ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే అలాంటి ముద్దులకు దూరంగా ఉండడమే మంచిది.

Tags:    

Similar News