సెక్స్ లేని వివాహ‌ బంధం శాపం: ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఓ విడాకుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. శృంగారం లేని వివాహ బంధం శాపం వంటిద‌ని పేర్కొంది.

Update: 2023-09-18 15:01 GMT

ఓ విడాకుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. శృంగారం లేని వివాహ బంధం శాపం వంటిద‌ని పేర్కొంది. ఉద్దేశ పూర్వ‌కంగా జీవిత భాగ‌స్వామి సెక్స్‌ను నిరాక‌రించ‌డం నేర‌మేన‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సెక్స్‌ను నిరాక‌రించ‌డం.. క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని సంచ‌ల‌న కామెంట్ చేసింది. ఈ క్ర‌మంలో స‌ద‌రు దంప‌తుల‌కు విడాకులు మంజూరు చేసింది.

విష‌యం ఏంటంటే..

ఢిల్లీకి చెందిన ఓ జంట‌కు 2004లో వివాహం జ‌రిగింది. అయితే.. తొలి రోజుల్లో అంటే.. సుమారు ఓ 35 రోజుల పాటు ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిస్థితి బాగానే ఉంది. దీంతో భార్యా భ‌ర్త‌.. శృంగారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం తేడా వ‌చ్చిందో కానీ.. భార్య వేరుగా ప‌డుకోవ‌డం.. క‌నీసం త‌న ఒంటిపై చేయి కూడా వేయ‌కుండా భ‌ర్త నుంచి త‌ప్పించుకుని తిర‌గ‌డం ప్రారంభించింది.

ఒక ద‌శ‌లో పుట్టింటికి వెళ్లిపోయి.. తిరిగి కూడా రాలేదు. అంతేకాదు.. భ‌ర్త‌పై అద‌న‌పు క‌ట్నం, వేధింపుల కేసు కూడా పెట్టింది. దీంతో విసిగి పోయిన స‌ద‌రు భ‌ర్త కుటుంబ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఇద్ద‌రికీ స‌రిప‌డ‌డం లేద‌ని గుర్తించి.. విడాకులు మంజూరు చేసింది.

అయితే, త‌న‌కు విడాకులు ఇవ్వ‌డాన్ని స‌హించ‌లేని స‌ద‌రు భార్య ఈ విడాకుల‌పై ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కా రు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ‌, కింద కోర్టు తీర్పును ప‌రిశీలించిన హైకోర్టు.. విడాకుల‌ను స‌మ‌ర్థించింది. అంతేకాదు.. భ‌ర్త మాన‌సిక ఆరోగ్యానికే కాకుండా.. కుటుంబ ఆరోగ్యానికి కూడా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య శృంగారం అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొంది. శృంగారం లేని వివాహ బంధం శాపం లాంటిదేన‌ని తెలిపింది. అంతేకాదు.. అద‌న‌పు క‌ట్నం.. కేసులో ఎలాంటి ఆధారాలు లేవ‌ని కోర్టు పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.

Tags:    

Similar News