నీతులు చెప్పే కరత్ చైనా తరఫున వకల్తా.. సంచలన మరక బయటకు!
చైనా ప్రయోజనాల కోసం పని చేసే అమెరికా వ్యాపారవేత్త నెవిల్లే రాయ్ తో కరత్ లాంటి కమ్యునిస్టు నేత ఎందుకు సంప్రదింపులు జరిపారు?
నిత్యం నీతులు చెబుతూ.. రాజకీయాల్లో సచ్ఛీలతకు.. కమిట్ మెంట్ కు తమకు మించినోళ్లు లేదని బాజా బజాయించి చెప్పే రాజకీయపార్టీల్లో కమ్యునిస్టులు ముందుంటారు. సిద్ధాంతాల పేరుతో వారు చెప్పే మాటలు అన్ని ఇన్ని కావు. అయితే.. ఇవన్నీ నాణెనికి ఒకవైపు. మరోవైపు వారెలాంటి వారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పే కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. సీపీఎం అగ్రనేతల్లో ఒకరు.. ఆ మధ్య వరకు పార్టీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన ప్రకాశ్ కరత్ కు సంబంధించిన చైనా లెక్కలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
సీపీఎం జాతీయ నాయకుడికి అమెరికాకు చెందిన అపర కుబేరుడికి మధ్య జరిగిన ఈమొయిళ్ల సందేశాల గుట్టు రట్టైంది. ఈ మొయిళ్లపై ఈడీ కన్నేసింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా ప్రకాశ్ కారత్ కు చెందిన న్యూస్ క్లిక్ అనే న్యూస్ వెబ్ సైట్ కు పెద్ద ఎత్తున నిదులు అందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈడీ ఇప్పుడు ఫోకస్ చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం ఈ ఉదంతంపై కేసు నమోదైంది.
ఈ కేసును విచారిస్తున్న ఈడీ చేతికి తాజాగా సీపీఎం నేత కరత్ కు.. నెవిల్లే రాయ్ కు మధ్య సాగిన ఈమొయిళ్లు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ బయట పెట్టింది. అదే సమయంలో ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ బ్యాంక్ అకౌంట్ కు న్యూస్ క్లిక్ నుంచి రూ.40 లక్షలు జమ కావటం ఆసక్తికరంగా మారింది.
న్యూస్ క్లిక్ వెబ్ సైట్ కు పని చేస్తున్న పలువురికి అందిన నిధుల లెక్కలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. తమ ఖాతాల్లో పడిన డబ్బుల లెక్కలపై కరత్ తో సహా ఎవరూ నోరెత్తకపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీసేలా మారింది. చైనా ప్రయోజనాల కోసం పని చేసే అమెరికా వ్యాపారవేత్త నెవిల్లే రాయ్ తో కరత్ లాంటి కమ్యునిస్టు నేత ఎందుకు సంప్రదింపులు జరిపారు? వారి మధ్య సాగిన ఈమొయిళ్లలో వివరాలేంటి? నెవెల్లే నుంచి నిధులు ఎందుకు వచ్చినట్లు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.
ఒక ఈమొయిల్ లో చైనా వ్యతిరేక విధానాలపై కరత్ అసంత్రప్తి వ్యక్తం చేసిన వైనాన్ని ఈడీ సేకరించిన మొయిల్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చైనా నుంచి పెట్టుబడులు రానీయటం లేదు.. అక్కడి ఉత్పత్తుల్ని దిగమతి చేసుకోవటం లేదు.. దీంతో మా దేశానికి అపారమైన నష్టం వాటిల్లుతోందని కరత్.. అమెరికా వ్యాపారవేత్తకు రాసిన మొయిల్ లో పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఎపిసోడ్ మీద కరత్ ఇప్పటివరకు స్పందించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో కమ్యునిస్టుల మీద ఒక జోక్ ఉండేది. చైనాకు జలుబు చేస్తే.. భారత్ లో ఉన్న కమ్మునిస్టులకు పడిశం పట్టేదని.. తాజా ఉదంతం ఆ విషయాన్ని గుర్తు చేసేలా ఉండటం గమనార్హం.