షర్మిలపై క్రిమినల్ కేసు... సజ్జల సంచలన వ్యాఖ్యలు!

అవును... జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్య్లు, రాసిన లేఖలు ఇప్పుడు తీవ్ర సంచలనమవుతున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

Update: 2024-10-26 07:05 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు వరుసగా మైకుల ముందుకు వస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలు ఖండిస్తు.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ సమయంలో ఇప్పటికే మాజీమంత్రి పేర్ని నాని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇవ్వగా.. సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సజ్జల స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల వ్యవహారంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై శ్రేణులకు స్పష్టత ఇస్తూ పిలుపునిచ్చారు.

అవును... జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలు ఇప్పుడు తీవ్ర సంచలనమవుతున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఈ వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా... రక్తం పమంచుకు పుట్టిన చెల్లిపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన సొంత ఆస్తుల్లోనూ వాటా ఇస్తామని అన్నారని.. కానీ, గిఫ్ట్ డీడ్ ను షర్మిల దుర్వినియోగం చేశారని.. తల్లి పేరిట షేరుగా మార్చారని చెప్పారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసి, అవి పోయాయని అబద్ధాలు ఆడారని చెప్పారు.

ఈ విధంగా షర్మిల చేసిన చట్టవిరుద్ధ చర్యలపై క్రిమినల్ కేసు పెట్టొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. సరస్వతి పవర్ షేర్ల వ్యవహారం హైకోర్టులో ఉందని.. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై స్టేటస్ కో మెయింటైన్ చేయాలని హైకోర్టు నిర్దేశించిందని తెలిపారు. ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు అని అన్నారు.

అందువల్లే.. దాన్ని ఆపాలంటూ జగన్ ఎన్.సీ.ఎల్.టీ.లో పిటిషన్ ఇచ్చారని వివరించారు. అంతేతప్ప.. ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని.. సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా షర్మిల కుయుక్తులు పన్నారని.. జగన్ ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలనే చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేశారని సజ్జల వివరించారు!

ఈ విషయం తెలిసిన వెంటనే.. ఈ సమయంలో షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని, దాన్ని ఆపాలంటూ చెల్లికి జగన్ లేఖ రాశారని.. ఆమె ససేమిరా అనడంతోనే న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నారని.. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు షర్మిల.

Tags:    

Similar News