దానం ఓవర్ ఎక్స్ పెక్టేషన్ !

ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం హఠాత్తుగా జెండా మార్చి కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా లైన్లోకి దిగాడు.

Update: 2024-05-01 16:30 GMT

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని చేవెళ్ల, సికింద్రాబాద్,మల్కాజ్ గిరి నుండి బీఅర్ఎస్ నుండి వలస వచ్చిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే గానం నాగేందర్, సిట్టింగ్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం హఠాత్తుగా జెండా మార్చి కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా లైన్లోకి దిగాడు. బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్, బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా మీద నమ్మకంతో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడి నుంచి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తానని, తాను 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని’’ కాంగ్రెస్ అభ్యర్థి దానం అంటున్నారు.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో 62 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నిక ఆసక్తి రేపుతున్నది. లక్ష 73 వేల ఓట్లకే కాంగ్రెస్ పరిమితం అయింది.

ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా 2 లక్షల మెజారిటీ అని చెప్పడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. 2004లో టీడీపీ నుండి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. సరిగ్గా తాజాగా ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు పాత ఫలితాలను ప్రస్తావిస్తున్నారు.

Tags:    

Similar News