ఈ టీపొడి చాలా కాస్టలీ గురూ!

ప్రపంచంలో టీ ప్రియులు కాని ఎవరు?... దాదాపు అంతా టీ పాన ప్రియులే. టీ రుచి అంతా టీ తయారీకి వాడే టీ పొడిలోనే ఉంటుంది.

Update: 2024-04-26 13:30 GMT

ప్రపంచంలో టీ ప్రియులు కాని ఎవరు?... దాదాపు అంతా టీ పాన ప్రియులే. టీ రుచి అంతా టీ తయారీకి వాడే టీ పొడిలోనే ఉంటుంది. క్వాలిటీ టీ పొడి వాడితే ఆ టీ రుచే వేరు. ఈ నేపథ్యంలో మనదేశంలో అత్యంత కాస్టలీ టీ పొడి ఏదో తెలుసుకోవాలనుందా? అయితే రండి..

పశ్చిమ బెంగాల్‌ లోని హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న డార్జిలింగ్‌ ప్రసిద్ధ పర్యాటక స్థలం, వేసవి విడిది కేంద్రం కూడా. ఈ హిల్‌ స్టేషన్‌ కు ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. డార్జిలింగ్‌ ప్రత్యేకత ఇదొక్కటే కాదు. ఇక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. డార్జిలింగ్‌ టీపొడికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.

ఇక్కడ కనుమల్లో, పర్వత ప్రాంతాల్లో పండే టీ పొడి అత్యంత శ్రేష్టమైనది. భారతదేశంలో అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటి డార్జిలింగ్‌ లో లభిస్తోంది. ఈ టీపొడి కిలో అక్షరాలా రూ. 1.5 లక్షలు కావడం విశేషం.

ఈ విలువైన టీ పొడి డార్జిలింగ్‌ లోని మాల్‌ రోడ్‌ ప్రాంతంలోని దుకాణంలో లభిస్తోంది. ఆ స్టోర్‌ మేనేజర్‌ ఈ ప్రత్యేకమైన టీపొడి గురించి వివరించారు.

తమ వద్ద 300 రకాల టీపొడి లభిస్తోందని చెప్పారు. కిలో ధర రూ. 400 నుంచి తమ వద్ద టీపొడి లభిస్తుందని తెలిపారు. గరిష్టంగా కిలో రూ. 1.5 లక్షల వరకు టీ పొడి ధరలు ఉన్నాయన్నారు. ఈ టీపొడిని 100 గ్రాములు, 250 గ్రాముల పరిమాణాలలో ప్యాక్‌ చేస్తామన్నారు. 100 గ్రాముల ధర సుమారు రూ. 15,000 అని వెల్లడించారు.

ఈ టీ పొడి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ టీ పొడిని సంవత్సరానికి 15–20 కిలోలు మాత్రమే తయారుచేస్తారు. ఇది ఇతర టీల కంటే భిన్నంగా ఉంటుంది. దీన్ని డార్జిలింగ్‌ లోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో పెరిగే తేయాకుల చివర కొనల నుంచి తయారుచేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా తోటలు పెంచుతారు. వీటిని తెల్లటి టీ అని కూడా పిలుస్తారు.

అయితే ఈ టీపొడి కిలో రూ.1.5 లక్షలు కావడంతో స్థానికంగా కొనేవారు పెద్దగా లేరు. పర్యాటకులు ఎవరైనా కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా విదేశాలకే ఎగుమతి చేస్తుంటారు.

డార్జిలింగ్‌ లో నాలుగు రుతువుల్లో అనేక రకాల టీపొడులు అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు రుతువుల్లో తయారుచేసే టీపొడి దేనికదే విభిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. డార్జిలింగ్‌ టీ, గ్రీన్‌ టీ, ఊలాంగ్‌ టీ, వైట్‌ టీలతో కూడిన వివిధ రకాల టీ పొడులు అందుబాటులో ఉంటాయి.

అంతేకాకుండా డార్జిలింగ్‌ టీ ఆరోగ్యకరమైనది. సేంద్రీయ పద్ధతుల్లో తయారైనది. 1800ల మధ్యకాలంలో డార్జిలింగ్‌ ప్రాంతంలో తేయాకు మొక్కలను మొట్టమొదట నాటారు. డార్జిలింగ్‌లో దాదాపు 17,500 హెక్టార్ల భూమిలో తేయాకు తోటలు ఉన్నాయి.

డార్జిలింగ్‌ టీ పరిశ్రమలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. డార్జిలింగ్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారాన్ని అందిస్తోంది.

Tags:    

Similar News