సర్కార్ సంచలన నిర్ణయం!... త్వరలో కొత్త బైక్ బీటింగ్స్ వినిపించవా?

ఇదే సమయంలో... అత్యంత కలుషిత నగరాల్లో భారత రాజధాని న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.;

Update: 2025-03-21 10:43 GMT
సర్కార్ సంచలన నిర్ణయం!... త్వరలో కొత్త బైక్ బీటింగ్స్ వినిపించవా?

ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్ ఏ స్థాయిలో కనిపించిందనే సంగతి తెలిసిందే. అత్యంత దారుణమైన స్థితికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోయిన పరిస్థితి. ఫలితంగా.. ఢిల్లీ వాసులకు వయసుతో సంబంధం లేకుండా శ్వాసకోస సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంచలన నిర్ణయం ఢిల్లీ సర్కార్ తీసుకోబోతోందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇదే సమయంలో... అత్యంత కలుషిత నగరాల్లో భారత రాజధాని న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీన్ని బట్టి దేశంలో, ప్రధానంగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... 2026 ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ టూవీలర్స్ కొత్త రిజిస్ట్రేషన్స్ పై నిషేధం విధించాలని ఢిల్లీ సర్కార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0లో ఈ ప్రతిపాదన అత్యంత కీలకమైన భాగంగా ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే ఇది ఖచ్చితంగా సంచలన నిర్ణయం కిందే లెక్క అని అంటున్నారు.

ఈ గడువు తర్వాత ఇకపై ఢిల్లీలో కొత్త టూవిలర్స్ కొనాలనుకునేవారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నమాట. ఇదే సమయంలో.. ఏ ఇంట్లోనైనా మూడో కారుగా ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేయాలని హస్తిన సర్కార్ ప్రతిపాదిస్తోందని చెబుతున్నారు. అదేవిధంగా.. ఇకపై ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలే కనిపించబోతున్నాయని అంటున్నారు!

అదేవిధంగా... 10ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న త్రీవీలర్ సీ.ఎన్.జీ. వాహనాలను ఈవీలతో భర్తీ చేయాలని సూచిస్తున్నారు. ఈ చర్యలతో 2027 నాటికి దేశ రాజధానిలో 95% ఈవీ వ్యాప్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా... వాతావరణ కాలుష్యాన్ని గరిష్టంగా తగ్గించొచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News