జీ-20 సదస్సులో కీలక పరిణామం... ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం!
ఆ అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది.
భారత్ మండపంలోని జరుగుతున్న జీ20 సదస్సు లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకొంది. న్యూఢిల్లీ డిక్లరేషన్ విషయంలో సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనకు సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. ఈ సందర్హంగా డిక్లరేషన్ కోసం శ్రమించిన మంత్రులు, అధికారులను ప్రధాని అభినందించారు.
అవును... ఇండియా వేదికగా జరుగుతున్న జి-20 సదస్సులో ఆదివారం మధ్యాహ్నాం దాకా ఏకాభిప్రాయానికి రావడం కష్టమని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో... ఆ అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది.
సదస్సు మధ్యలో ప్రధాని మోడీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో మోడీ భేటీ కానున్నారు. ఇదే సమయంలో అత్యంత కీలకమైన ఈ సదస్సుల్లో పలు కీలక ఒప్పందాలపై ప్రపంచ నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఇదే సందర్భంగా... 15 సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి తొలిసారి జీ-20 నేతలు కలిసి మందుకువచ్చామని.. సవాళ్ల సమయంలో కలిసామని.. మనమంతా కలిసి ఈ సవాళ్లను పరిష్కరించగలమని తాను నుమ్ముతున్నానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు.
ఇదే క్రమంలో జీ20 సదస్సు సైడ్ లైన్స్ లో భాగంగా ప్రధాని మోడీ అగ్రదేశాధినేతలతో వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. నేడు తొలి సెషన్ "వన్ ఎర్త్" లో భాగంగా జరిగిన చర్చలు నిర్మాణాత్మంగా జరిగాయని తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విటర్ లో వెల్లడించారు. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఇదే సమయంలో అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, భారత్ మధ్య మెగా రైల్ పోర్టు కనెక్టివిటీ డీల్ ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జీ-20లో శాశ్వత సభ్యదేశంగా మారినందుకు ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ అజలీ అసోమానిని ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
జీ20 రౌండ్ టేబుల్ పై ప్రధాని మోడీ కూర్చున్న చైర్ వద్ద ఉన్న నేమ్ ప్లేట్ పై "ఇండియా" అని కాకుండా "భారత్" అని రాసి ఉండటం గమనార్హం. అలాగే మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. "భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోంది" అని అన్నారు.