ప్రాశ్చాత్య దేశాల్లో ప్రజాస్వామ్యంపై అసంతృప్తి

ఇదంతా నిజమా? అనుకోవచ్చు. కానీ.. తాజాగా చేసిన సర్వేలో నమ్మలేని ఈ అంశాలు వెలుగు చూశాయి.

Update: 2024-07-12 11:30 GMT

తినగ తినగ గారెలు సైతం చేదుగా మారుతూ ఉంటాయన్న సామెత మనకు తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛను ప్రపంచంలోనే ఎక్కువగా పొందే ప్రాశ్చాత్య దేశాల ప్రజలకు.. ఆ వ్యవస్థ మీద అసంతృప్తి ఎక్కువ అవుతోందట. ఓవైపు ప్రజాస్వామ్యం లేదని కిందా మీదా పడే దేశాల ప్రజలకు భిన్నంగా వీరి తీరు ఉండటం గమనార్హం. ఇదంతా నిజమా? అనుకోవచ్చు. కానీ.. తాజాగా చేసిన సర్వేలో నమ్మలేని ఈ అంశాలు వెలుగు చూశాయి.

ప్రాశ్యాత్య దేశాలు.. మరీ ముఖ్యంగా అధిక ఆదాయ దేశాలు.. పశ్చిమ దేశాల్లోని ప్రజలు తమ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ 27 దేశాల్లోని 900లకు పైగా ప్రజలతో సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఇందులోకి కీలక అంశాల్ని చూస్తే..

- ఉత్తర అమెరికాలో 68 శాతం ప్రజలు ప్రస్తుత ప్రజాస్వామ్యం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

- మెక్సికోలోనూ 50 శాతం మంది ప్రజలు ఇదే భావనను వ్యక్తం చేస్తుండగా.. కెనడా ప్రజలు సైతం ఇదే బాటలో ఉన్నారు. 52 శాతం కెనడా ప్రజలు మాత్రమే ప్రస్తుత ప్రజాస్వామ్యంపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

- యూరోప్ లోని స్వీడన్ ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 75 శాతం మంది ప్రజాస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

- ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ లో కేవలం 35 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్యంపట్ల సానుకూలత ను వ్యక్తం చేయటం గమనార్హం.

- గ్రీస్ లో అత్యల్పంగా 22శాతం మంది ప్రజాస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

- యూరోప్.. పశ్చిమ దేశాలకు భిన్నంగా ఆసియా దేశాలైన సింగపూర్.. భారత్ ప్రజలు మాత్రం 75 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారు. సింగపూర్ లో ఇది 80 శాతం ఉంది.

- ఆసియా దేశాల్లో జపాన్ లోనూ 31 శాతం మంది సంతృప్తితో ఉన్నారు. అక్కడి ప్రజాస్వామ్యం తీరుపై సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు.

- 17 ప్రాశ్చత్య దేశాల్లోని 11 దేశాల్లో మాత్రం అక్కడి ప్రజాస్వమ్యంపై అసంతృప్తిగా ఉన్నారు.

Tags:    

Similar News