క్షమించమంటూ పవన్ ప్రాయశ్చితం దీక్ష!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమించు అంటూ లేటేస్ట్ గా ట్వీట్ చేశారు.

Update: 2024-09-21 16:47 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమించు అంటూ లేటేస్ట్ గా ట్వీట్ చేశారు. ఏడుకొండల వాడు క్షమించాలని భక్తిపూర్వకంగా కోరుకున్నారు.

తిరుమల లడ్డూ కల్తీ అయిన నేపథ్యంలో ఆయన తాను ప్రాయశ్చితం దీక్షను చేపట్టనున్నట్లుగా తెలిపారు. జరిగిన తప్పునకు పాపానికి వినాశనంగా ఈ ఆదివారం నుంచి ఏకంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను పూనుకున్నారు. ఆయన కాకానిలోని దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉదయాన్నే వెళ్ళి అక్కడ స్వామి సాక్షిగా దీక్షను తీసుకుంటారు అని తెలుస్తోంది.

ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి నియమాలతో ఆధ్యాత్మిక ధోరణిలో పవన్ చేపడుతున్నారు. గతంలో కూడా పవన్ వారాహి అమ్మ వారి దీక్షను చేపట్టారు. అలాగే ఆయన అనేక ఆధ్యాత్మిక దీక్షలను చేపట్టారు. పవన్ కళ్యాణ్ లో భక్తి భావాలు మెండుగా ఉన్నాయి.

ఆయన పూర్తి సంప్రదాయబద్ధంగా ఈ దీక్షలను చేస్తారు. ఇపుడు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు గాయపడి అంతా రగిలిపోతున్న నేపథ్యంలో కూటమిలో ముఖ్య నేతగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయంలో అపచారాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి సంచలనం రేపారు. దాంతో నాలుగు రోజులుగా ఏపీ అట్టుడికిపోతోంది.

ఈ క్రమంలో శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ సహా ఏమేమి ప్రక్షాళకు చేయాలి అన్నది ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికపరంగా కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. దేవుడు పట్ల ఏ మాత్రం విశ్వాసం లేని వారు పాప భీతి లేని వారే ఇలాంటి పనులు చేస్తారు అని ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఇలాంటి వాటికి ఆదిలోనే కనిపెట్టకపోతే ఏకంగా హైందవ జాతికే అది కలంకంగా మారుతుందని పవన్ పేర్కొనడం విశేషం. మొత్తానికి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Tags:    

Similar News