దేవినేని అవుట్
రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలో నుండి తప్పుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం
రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలో నుండి తప్పుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మైలవరం నుండి పోటేచేయాలని దేవినేని అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ ఎంఎల్ఏ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరటంతో ఉమకు ఇబ్బందులు మొదలయ్యాయి. పోయిన ఎన్నికల్లో వసంత చేతిలోనే ఉమ ఓడిపోయారు. దాంతో రాబోయే ఎన్నికల్లో కూడా వసంత మైలవరంలోనే పోటీచేయాలని పట్టుబట్టారు. అయితే ఆయనకు వైసీపీలో ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో సడెన్ గా ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
వసంత టీడీపీలో చేరుతారనే ప్రచారం మొదలైన దగ్గర నుండి ఉమకు టికెట్ సందేహమనే ప్రచారం పెరిగిపోయింది. ఆ ప్రచారం నిజమయ్యేట్లుగానే చివరకు మైలవరం టికెట్ వసంతకే ఫైనల్ అయ్యింది. నియోజకవర్గంలో టికెట్ కోసం ఇటు వసంత అటు ఉమ ఇద్దరు గట్టిగా పట్టుబడట్టడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోయింది. ఉమతో చంద్రబాబు నాయుడు రెండు సార్లు మాట్లాడినా ఉపయోగం కనబడలేదు. ఇంతలో వసంత-ఉమ వర్గాల మధ్య మాటమాట పెరిగిపోయి వివాదం పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే ఉమను పెనమలూరులో పోటీ చేయమని చంద్రబాబు సూచించారు. అందుకు ఉమ అంగీకరించలేదు.
పెనమలూరులో పోటీ చేయడం ఉమకు ఇష్టంలేకపోగా అక్కడి మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ అడ్డం తిరిగారు. దాంతో ఏమిచేయాలో చంద్రబాబుకు అర్ధం కాలేదు. అయితే బుధవారం రాత్రి ఉమను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీలో మైలవరంలో వసంతకు టికెట్ ఖాయమైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపును దృఫ్టిలో పెట్టుకుని వసంత విజయానికి సహకరించమని చంద్రబాబు మాటగా అచ్చెన్న చెప్పారు. పనిలోపనిగా ఉమను పెనమలూరులో పోటీచేయమని సూచించారట.
తాజా పరిణామాలకు ఉమ ఎలా రెస్పాండవుతారో అర్ధం కావటంలేదు. పెనమలూరులో దేవినేని పోటీ చేస్తారో లేదో తెలీదు కాని మైలవరం నుండి అవుట్ అన్న విషయం స్పష్టమైపోయింది. మరి ఉమ పెనమలూరులో పోటీకి రెడీ అంటే మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ ఎలా రియాక్టవుతారనే విషయం పార్టీలో ఉత్కంఠను పెంచేస్తోంది. ఎందుకంటే పెనమలూరు వైసీపీ ఎంఎల్ఏ కొలుసు పార్థసారధికి టికెట్ ఇవ్వాలని అనుకున్నపుడు కూడా బోడె అడ్డంపడ్డారు. దాంతో కొలుసును నూజివీడుకు పంపారు. అలాగే వసంతను మైలవరంలో కాకుండా పెనమలూరులో పోటీ చేయమంటే అందుకు ఒప్పుకోలేదు. ఇపుడు దేవినేనిని పెనమలూరులో పోటీ చేయిస్తామన్నా బోడె అంగీకరించలేదు. మరి తాజా పరిణామాల్లో ఉమ-బోడె ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.