సంచలనం... ప్రపంచ కుబేరుడిగా మస్క్ మరో చరిత్ర!
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ తర్వాత ఎలాన మస్క్ కు శుక్రమహర్దశ పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అప్పటికే ప్రపంచ కుబేరుడు.. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు.. మరోపక్క ట్రంప్ కేబినెట్ లో కీలక భూమిక పోషించబోతున్నారు.. దీంతో... ఆ కుబేరుడి సంపద మరింత భారీగా పెరిగిపోతోంది. ఈ సమయంలో సరికొత్త రికార్డ్ నమోదైంది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ తర్వాత ఎలాన మస్క్ కు శుక్రమహర్దశ పీక్స్ కి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పేస్ ఎక్స్ అధినేత, ఎలాన్ మస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలుస్తోంది. ఈ మేరకు నివేదికలు తెరపైకి వస్తోన్నాయి!
వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజే (నవంబర్ 5) టెస్లా స్టాక్ 40 శాతం పెరగా.. శుక్రవారం ఒక్కరోజే 3.8 శాతం పెరిగిందని అంటున్నారు. దీంతో.. మస్క్ సంపద 320 బిలియన్ డాలర్ల మార్కు దాటేసిందని అంటున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం టాప్ లో ఉన్న ఆర్నాల్డ్ నికర సంపద 223 బిలియన్ డాలర్లు అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో సన్న్నిహిత సంబంధాల కారణంగా ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లుగా ఉంది.. ఇది ప్రపంచ కుబేరుడిగా సరికొత్త చరిత్ర అని అంటున్నారు.
కాగా... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్న్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు స్పేస్ ఎక్స్ అధినేత మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ తరుపున ప్రచారం చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినట్లు చెబుతారు! దీంతో... ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాన్ మస్క్ ను ప్రత్యేకంగా అభినందించారు ట్రంప్.
ఇదే సమయంలో... డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నెమెంట్ ఎఫిషియెన్సీ సంయుక్త సారథులుగా వివేక్ రామస్వామితో పాటు ఎలాన్ మస్క్ ను నియమించారు. దీంతో.. ట్రంప్ సంపద పరుగులు పెట్టడంలో ఈ అంశం పాత్ర కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు!