వైసీపీ అస‌లు శ‌త్రువులు వీరే.. !

క‌ష్ట‌మైనా.. న‌ష్ట‌మైనా.. క‌ళ్ల ముందు క‌నిపి స్తుంది. కానీ, అంత‌ర్గ‌త శ‌త్రువుల‌ను గుర్తించ‌డం మాత్రం చాలా క‌ష్టం.

Update: 2024-10-20 03:45 GMT

ఏ పార్టీకైనా.. శ‌త్రువులు కామ‌న్‌. అయితే.. కొంద‌రు బ‌య‌ట‌కు క‌నిపిస్తారు. మ‌రికొంద‌రు బ‌య‌ట‌కు క‌నిపిం చ‌రు. బ‌య‌ట‌కు క‌నిపించే వారితో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఉన్న ప్ర‌మాదం, ఇబ్బంది రెండూ కూడా.. బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. వీరిని ఎదుర్కోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. క‌ష్ట‌మైనా.. న‌ష్ట‌మైనా.. క‌ళ్ల ముందు క‌నిపి స్తుంది. కానీ, అంత‌ర్గ‌త శ‌త్రువుల‌ను గుర్తించ‌డం మాత్రం చాలా క‌ష్టం. ఇలా గుర్తించిన నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. లేని వారు ఓడిపోయారు. దీనికి చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఉదాహ‌ర‌ణ‌లే!

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. అప్ప‌ట్లో జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉంద‌ని నాయ‌కుల నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. పార్టీ వ‌ర్గాల నుంచి తెప్పించుకున్నారు. స‌ల‌హాదారుల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. కానీ, అంద‌రూ సూప‌ర్‌గా ఉంద‌నే తేల్చి చెప్పారు. బాగోలేదంటే ఎక్క‌డ సార్‌కు కోప‌మొస్తుంద‌ని అనుకున్న వారు మౌనంగా ఉన్నారు. ఇది చంద్ర‌బాబును ప‌రాభ‌వం దిశ‌గా న‌డిపించింది. ఇలానే 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు కూడా అంత‌ర్గ‌తంగా ఇచ్చిన రిపోర్టులు త‌ప్పుల త‌డ‌క‌!

అంటే.. శ‌త్రువులు ఎక్క‌డో లేరు.. అన్న విష‌యాన్ని నాయ‌కులు గుర్తించ‌లేక పోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాతే చంద్ర‌బాబు గుర్తించారు. అందుకే.. బాగుంద‌న్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టికి రెండు సార్లు ప‌రిశీల‌న చేసుకున్నారు. స్వ‌యంగా తాను ప‌ర్య‌టించి నిజాలు తెలుసుకున్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ అధినేత కూడా ఇలానే బుట్ట‌లో ప‌డిపోయారు. అంతా బాగుంది స‌ర్‌! అని ముఖ‌స్తుతి చేసేవారి మాట‌లే ఆయ‌న న‌మ్మారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ఇబ్బందులు ఉన్నాయ‌ని గుర్తించినా.. ఈ రేంజ్‌లో ఉన్నాయ‌ని గుర్తించ‌లేక‌పోయారు.

చిత్రం ఏంటంటే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు లోపాలు గుర్తించేందుకు ఆరు మాసాలు ప‌ట్టింది. కానీ, ఇప్పుడు నాలుగు నెల‌ల‌కే జ‌గ‌న్ గుర్తించారు. త‌న మీడియా ద్వారా కావొచ్చు.. లేదా మ‌రో మార్గంలో అయినా.. వైసీపీపై ఉన్న ఇమేజ్‌.. త‌ప్పులు చెబుతున్న వారిని ఆయ‌న లెక్క‌గ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మార్పుల దిశ‌గా అడుగులు వేశారు. ఇంచార్జ్‌ల‌ను మార్పు చేశారు. అయితే.. ఇక్క‌డితో స‌రిపోతుందా? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌.. పొగ‌డ్త‌ల‌కు దూరంగా విమ‌ర్శ‌ల‌కు దగ్గ‌ర‌గా ఉంటూ..త న‌ను తాను ప‌రిశీలించుకుంటేనే మార్పు సాధ్య‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News