కరోనా కంటే యమ డేంజర్ ఈ వైరస్!
'డిసీజ్ ఎక్స్' అనే మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని బ్రిటన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్-19 అంటే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కరోనా అన్న పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా సగటు మనిషి గుండెల్లో గుబులు పుట్టక మానదు. ఎందుకంటే గత వందేళ్ళలో కరోనా మహమ్మారి భయపెట్టినంతగా ప్రజలను మరే వ్యాధి భయపెట్టలేదు. ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా మూడు వేవ్ లతో ప్రపంచాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించిన కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజలు ఇప్పటికీ వణికిపోతుంటారు. కోట్లాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రాణాంతక వ్యాధి ఇప్పుడిప్పుడే ఎండమిక్ దశకు చేరుకుంటోంది.
కరోనా బారి నుంచి కాస్తంత ఉపశమనం లభించింది అని ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలకు మరో మహమ్మారి సవాల్ విసురుతుంది. 'డిసీజ్ ఎక్స్' అనే మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని బ్రిటన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా మాదిరిగానే ఈ డిసీజ్ ఎక్స్ కూడా కోట్లాది మందిపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ లీడ్ చేస్తున్న కేట్ ఆ వైరస్ ఎంత ప్రమాదకరమో చెప్పారు. కరోనాతో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ ప్రభావం చూపించగలిగిన ఈ డిసీజ్ ఎక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది.
ఈ డిసీజ్ ఎక్స్ పై ఇప్పటికే అప్రమత్తమైన బ్రిటన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యారని తెలుస్తోంది. లేబరేటరీలో ఈ మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అంటు వ్యాధుల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాలని చెబుతున్నారు.