యూఎస్‌లో డిస్నీ ఛానల్ షట్‌డౌన్!
ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఇటలీ, యూకే, దక్షిణ కొరియా దేశాల్లో డిస్నీ ప్రసారాలు ఇప్పటికే నిలిపి వేయడం జరిగింది.
బుల్లితెర వినోద రంగంలో డిస్నీది సుదీర్ఘమైన చరిత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో డిస్నీ ఛానల్స్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో డిస్నీ సేవలను నిలిపివేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో డిస్నీ చానల్స్ మూత పడ్డాయి. ఇప్పుడు అమెరికాలోనూ అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2025 జనవరిలో డిస్నీ ఛానల్ ను పూర్తిగా అమెరికాలో నిలిపి వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై డిస్నీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఇటలీ, యూకే, దక్షిణ కొరియా దేశాల్లో డిస్నీ ప్రసారాలు ఇప్పటికే నిలిపి వేయడం జరిగింది. డిస్నీ జూనియర్స్, డిస్నీ ఛానల్స్ ఫ్రాన్స్‌లో జనవరి నుంచి నిలిపి వేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఫ్రాన్స్‌తో పాటు అమెరికాలోనూ డిస్నీ ప్రసారాలు నిలిపి వేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అమెరికాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్నీ ప్రసారాలు కొనసాగుతున్నాయి.
అమెరికాలో ఇప్పటికీ డిస్నీ ప్రసారాలు టాప్‌లో ఉంటాయి. అత్యధిక ప్రేక్షకుల ఆధరణ పొందుతున్న డిస్నీ ప్రసారాలను నిలిపి వేయడం అనేది సమంజసమైన నిర్నయం కాదు అంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిస్నీ ప్లస్ కి వస్తున్న ఆధరణ నేపథ్యంలో డిస్నీ ని అన్ని దేశాల్లో నిలిపి వేయాలనే నిర్ణయానికి ఇప్పటికే సదరు సంస్థ వచ్చింది. మెజారిటీ దేశాల్లో ప్రసారాలు నిలిపివేయడంతో అమెరికాలోనూ అతి త్వరలోనే ప్రసారాలు నిలిపి వేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
డిస్నీ ఛానల్‌లో గతంలో ప్రసారం అయ్యి మంచి ఆధరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలు, సిరీస్‌లు అన్నింటినీ డిస్నీ ప్లస్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే ఈ విషయమై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. డిస్నీ ప్లస్ లో సదరు కార్యక్రమాలు అన్నీ అందుబాటులో ఉంటాయంటూ అధికారికంగా ప్రకటన రావడంతో యూఎస్‌లోనూ డిస్నీ ఛానల్ షట్‌డౌన్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే అధికారికంగా ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.