ట్రంప్ ప్రమాణస్వీకారానికి అతిథులు వీరే... భారత్ నుంచి ఎవరంటే..?

గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు

Update: 2025-01-17 00:30 GMT

గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఈ జాబితాలో దేశాధినేతలు, కీలక నాయకులతో పాటు పలువురు టెక్ దిగ్గజాలు ఉన్నారు.

అవును... జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. యూఎస్ క్యాపిటల్ లో జరిగే ఈ కార్యక్రమానికి భారత్ తరుపున భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు.

* ఇక ట్రంప్ ప్రమాణస్వీకార కారక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ హాజరుకాబోతున్నారు.

* ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం ఆయనను అభినందించిన మొదటి ప్రపంచ నాయకుల్లో ఒకరైన ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే కు ఆహ్వానం అందింది.

* అదేవిధంగా... ట్రంప్ కి పూర్తి మద్దతుదారుగా ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆహ్వానం అందింది. ఆమె ఈ కారక్రమానికి హాజరవుతున్నట్లు చెబుతున్నారు.

* ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఆహ్వానం అందినప్పటికీ.. ఆయన తరుపున ఉన్నతస్థాయి రాయబారి ఈ కార్యక్రమానికి చైనా నుంచి వెళ్తున్నారని అంటున్నారు.

* ఇదే క్రమంలో... ట్రంప్ కి సన్నిహిత విదేశీ మిత్రుల్లో ఒకరైన హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ తో పాటు అరెంటీనా ప్రెసిడెంట్ జైర్ బోల్సోనార్.. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.

* ఇదే క్రమంలో జపాన్ తరుపున ఆ దేశ విదేశాంగం మంత్రి తకేషి ఇవాయా హాజరుకాబోతుండగా.. ఫ్రాన్స్ నుంచి జాతీయవాద నాకుడిగా పేరున్న ఎరిక్ జెమ్మౌర్ హాజరుకాబోతున్నారు.

* యునైటెడ్ కింగ్ డమ్ నుంచి పలువురు రాజకీయ నాకులతో పాటు ట్రంప్ మిత్రుడైన నిగెల్ ఫరాజ్ హాజరవుతున్నారని అంటున్నారు.

* ఇక బిలియనీర్లు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్ మాన్ లు ఈ కార్యక్రమానికి హాజరవ్వబోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News