లుక్కు మారింది... ట్రంప్ న్యూ హెయిర్ స్టైల్ వీడియో వైరల్!
ఈ సమయంలో ట్రంప్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది అగ్రరాజ్యం అధినేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం తన టీమ్ ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అవును... అమెరికా అధ్యక్షులందు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వేరయా అని అంటారు. ఇప్పటికే ట్రంప్ పాలన ఒకసారి చూసినప్పటికీ.. 'ట్రంప్ 2.0' మాత్రం అంతకు మించి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వంటి నినాదాలకు న్యాయం చేసే దిశగానే ట్రంప్ పాలన ఉండబోతుందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని 'ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్డ్ క్లబ్' లోని తన ప్రైవేట్ ప్రాపర్టీ వద్ద డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులను అప్యాయంగా పలకరిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.
అంతకంటే ముఖ్యంగా ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించారు. దీంతో... వచ్చే ఏడాది ఆయన అధ్యక్ష పదవికి ముందు మెక్ ఓవర్ గా సోషల్ మీడియా జనాలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా.. ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 295 ఎలక్టోరల్ ఓట్లను సాధించి విజయం సాధించారు ట్రంప్. వైట్ హౌస్ లో మరోసారి ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన 270 మ్యాజిక్ ఫిగర్ ఓట్లను హాయిగా దాటారు. మరోపక్క 226 ఎలక్టోరల్ ఓట్లతో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ నిలిచారు.