డాలర్ డ్రీమ్స్ : చదువు పూర్తయితే గ్రీన్ కార్డ్ !

కాలేజ్ నుంచి గ్రాడ్జ్యుయేట్ అయితే.. మీ డిప్లొమాతో పాటు ఆటోమెటిక్గా గ్రీన్ కార్డ్ పొంది దేశంలో ఉండిపోయే విధంగా నాకు చేయాలని ఉంది.

Update: 2024-06-21 05:27 GMT

అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూసే విదేశీయుల సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుంది. అక్కడ పౌరసత్వం లభించక అనేక మంది నిరాశలో కూరుకుపోతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికెన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కీలక్ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ అమెరికా వర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే విదేశీ విద్యార్థులకు ఆటోమెటిక్గా గ్రీన్ కార్డ్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.

"కాలేజ్ నుంచి గ్రాడ్జ్యుయేట్ అయితే.. మీ డిప్లొమాతో పాటు ఆటోమెటిక్గా గ్రీన్ కార్డ్ పొంది దేశంలో ఉండిపోయే విధంగా నాకు చేయాలని ఉంది. జూనియర్ కాలేజీలకు కూడా ఇది వర్తిస్తుంది’’ అని, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దీనిపై మొదటి రోజే నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ చెప్పడం విశేషం.

అమెరికా ఫస్ట్ నినాదంతో గతంలో వలసవాదులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన ట్రంప్ ప్రస్తుతం యూటర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా అయింది. ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్కు సానుకూలంగా మాట్లాడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News