వైద్య చరిత్రలో అరుదైన కేసు... మొదట తల్లి, తర్వాత తండ్రి అయ్యింది!

సాధారణంగా పురుషులు, మహిళలు వేర్వేరు క్రోమో జోమ్ లను కలిగి ఉంటారనేది తెలిసిన విషయమే.

Update: 2025-01-10 20:30 GMT

సాధారణంగా పురుషులు, మహిళలు వేర్వేరు క్రోమో జోమ్ లను కలిగి ఉంటారనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా.. పురుషులలో (ఎక్స్ వై) క్రోమోజోములు, స్త్రీలలో (ఎక్స్ ఎక్స్) క్రోమోజోములు ఉంటాయి. అయితే తాజాగా చెప్పుకోబోయే కేసులో ఒకే వ్యక్తికి అండాశయం, వృష్ణ కణజాలం రెండూ ఉన్నాయి. ఆమె ఎవరు.. ఏమా కేసు అనేది ఇప్పుడు చూద్దామ్!

అవును... ఒకే వ్యక్తికి అండాశయం, వృష్ణ కణజాలం రెండూ ఉన్న అత్యంత అరుదైన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. వైద్య భాషలో దీన్ని ఓవోటెస్టిక్యులర్ డొజాస్టర్ అంటారు. ఈ అరుదైన పరిస్థితిని చైనాకు చెందిన లియు (59) అనే మహిళ కలిగి ఉంది. ఆమెకు రెండు పునరుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. అయితే గుర్తింపు కార్డులో మాత్రం మహిళగానే ఉంది.

లియు అనే మహిళ నైరుతి చైనాలోని బిషన్ కౌంటీలో నివస్తుంది. ఆమె చిన్నతనం నుంచి షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడంతోపాటు మగవాళ్ల దుస్తులు ధరిస్తు ఉండేది. ఈ క్రమంలో... ఆమె 18 ఏళ్ల వయసులో టాంగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఓ కుమారుడుకి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె శరీరంలో మార్పులు మొదలవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా... లియుకు ఒక్కసారిగా గడ్డం పెరగడం ప్రారంభమైంది. దానికి కారణం... ఆండ్రోజెనిక్ హార్మోన్ల ఆకస్మిక పెరుగుదలే. ఇదే సమయంలో ఆమె రొమ్ముల పరిమాణం తగ్గింది. ఇదే క్రమంలో... ఆమె పురుష పునరుత్పత్తి అవయువాలు కూడా పెరగడం మొదలయ్యింది. దీంతో... లియుకు ఆమె భర్త టాంగు విడాకులు ఇచ్చాడు.

అప్పటి నుంచి ఆమె తన కుమారుడితో విడిగా జీవిస్తోంది. అయితే.. విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన లియు.. షూ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుమారుడిని పెంచుకుంటుంది. అక్కడ పనిచేస్తున్న జౌ అనే మహిళా సహోద్యోగి పట్ల లియు ఆకర్షితుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకుని కలిసి జీవించాలని కోరుకున్నాడు.

అయితే... లియు అధికారిక పత్రాల్లో ఆమె ఓ మహిళగానే గుర్తించబడి ఉంది. అదే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. చైనాలో స్వలింగ వివాహం చట్టవిరుద్ధం అవ్వడంతో ఆమె ఇష్టపడిన కొలీగ్ ని వివాహం చేసుకోకుండా నిరోధించింది. ఈ సమయంలో ఆమె తన మొదటి భర్త టాంగ్ ని కలిసింది.

ఈ సమయంలో... ఇరువురి అభిప్రాయంతో తన మాజీ భర్త టాంగ్ కు జౌతో వివాహం జరిపించింది. ఈ కండిషన్ లో భాగంగా... లియు, జౌ కలిసి జీవించాలని పెట్టుకున్నారు. అప్పటి నుంచి జౌ ని పెళ్లి చేసుకున్నది టాంగ్ అయినప్పటికీ.. కాపురం చేసింది మాత్రం లియు అన్నట్లు అన్నమాట! ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత జౌ గర్భవతి అయ్యి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆ రకంగా ఇప్పుడు లియోకు ఇద్దరు కొడుకులు. అయితే... టాంగ్ తో కలిసి కనిన బిడ్డ లియుని అమ్మ అని పిలుస్తుండగా.. జౌ తో కలిసి కనిన కుమారుడు మాత్రం నాన్నగా పిలుస్తాడన్నమాట. ఇది చాలా అరుదైన సమస్య అని.. మిలియన్స్ లో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News