"తన విచిత్రమైన కథకు విడాకులే ముగింపు!"... దువ్వాడ కీలక వ్యాఖ్యలు!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలోని శ్రీనివాస్ ఇంటికి పెద్దకుమార్తె హైందవితో వాణి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఇంటిగేట్లు తెరుచుకోకపోవడంతో.. క్యాపు కార్యాలయం డోర్లను కట్టర్లతో కట్ చేశారు వాణి & కో!
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తన భార్య, కుమార్తె తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో దువ్వాడ, అతని సతీమణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ వాణి పట్టుబట్టింది. అయితే... ఆ కార్యాలయం కట్టించింది దానంటూ శ్రీనివాస్ తమ్ముడు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కల్పించుకున్న పోలీసులు.. ఇరువర్గాలకూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో... క్యాంపు కార్యాలయం ఖాళీ చేసేవరకూ తాను ఇక్కడే ఉంటానంటూ ఆమె ఆ ఆఫీసు బయటే నిద్రించారు. ఈ సందర్భంగా అసలు ఏ హక్కుతో మాధురి తన భర్తతో ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
ఈ సమయంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి అనే మహిళ కలిసి ఉంటుందని, ఆమె దువ్వాడను ట్రప్ చేసిందని ఆయన భార్య వాణి, కుమార్తెలు ఆరోపిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా శ్రీనివాస్ స్పందించారు. అసలు తనవద్ద ఏమి ఉందని మాధురి తనను ట్రాప్ చేస్తుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. తన వద్ద ఉన్న ఆస్తులు, ఫ్యాక్టరీలు ఇప్పటికే భార్య పిల్లలకు రాసినట్లు ఆయన తెలిపారు.
ఇదే క్రమంలో సుమారు 6 కోట్ల రూపాయలతో కట్టిన ఇంటిని భార్య పిల్లాలకే రాసిచ్చినట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది కాలంలొనే సుమారు ఒక కోటీ ఏభై లక్షలు నగదు రూపంలో ఇచ్చినట్లు చెప్పిన శ్రీనివాస్, వాటికి సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ పెట్టి అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తనది ఓ ప్రత్యేకమైన కథ అని.. ఈ కథకి ముగింపు విడాకులే అని స్పష్టం చేశారు.