బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు!

ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యలో సాగుతుండగా.. కేంద్ర ప్రభుత్వమూ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-03-15 10:34 GMT

అధికారం కోల్పోయి.. నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండగా.. లోక్ సభ ఎన్నికల వంటి కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు మరింత కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే కాళేశ్వరంపై న్యాయ విచారణ.. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యలో సాగుతుండగా.. కేంద్ర ప్రభుత్వమూ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముంగిట..

దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు ఎంతకూ తేలడం లేదు. కుంభకోణానికి కేంద్రమైన ఢిల్లికి చెందిన సీఎంను ఏడుసార్లు ఈడీ విచారణకు పిలిచినా హాజరుకాలేదు. ఇక ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలోనూ కవితను విచారణకు పిలిచారు. ఆ సందర్భంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట కీలక పరిణామం సంభవించింది. కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ నుంచి టీమ్..

హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. కాగా, ఈడీకి తోడుగా ఐటీ అధికారులూ వచ్చినట్లు తొలుత కథనాలు వినిపించాయి. అయితే, ఈడీ అధికారులు మాత్రమే తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తేలింది.

Tags:    

Similar News