హాట్ టాపిక్... ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ సంచలన నిర్ణయం!

ప్రస్తుతం ఏ మూల చూసినా ఇలాంటి సందడే కనిపిస్తుంది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ సంచలన ప్రకటన చేసింది.

Update: 2024-03-30 05:12 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చిన ప్రధాన పార్టీలు.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజిగా ఉన్నాయి. ప్రస్తుతం ఏ మూల చూసినా ఇలాంటి సందడే కనిపిస్తుంది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ సంచలన ప్రకటన చేసింది.

అవును.. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే... ఆయా రాజకీయ పార్టీలతో పాటు సర్వే సంస్థల సందడి కూడా బలంగా ఉంటుంది! పైగా ఈ మధ్య ఆ సందడి మరింత పెరిగిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ సర్వేల సందడి మొదలైంది.

ఈ సమయంలో పలు ఏజెన్సీలు నిర్వహించే సర్వే ఫలితాలు... తర్వాత రాబోయే వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటుండగా.. మరికొన్ని మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంటాయి. దీంతో... వీరికి అంచనా వేయడం రాలేదా.. లేక, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని సర్వేల పేరుతో జనాలపై రుద్దే ప్రయత్నం చేశారా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. ఈ సమయంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సంగతి కాసేపు పక్కనపెడితే... ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది!

ఎన్నికల్లో జనం ఎవరికి ఓటు వేశారు అని తెలుసుకుని.. వాటి ఆధారంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమిపాలవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది వంటి విషయాలను వెల్లడిస్తుంటారు. వీటిని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంటారు! ఇవి పోలింగ్ అయిన రోజు రాత్రే వచ్చేస్తుంటుంటాయి! అయితే... ఒక దశలోనే జరిగిపోయే ఎన్నికల విషయంలో సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సారి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సమయంలో ఒక దశ ఎన్నికలు పూర్తవ్వగానే దాని ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తే... వాటి ప్రభావం మిగతా దశల్లో జరిగే ఎన్నికలపై పడే అవకాశం ఉంది! దీంతో.. ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఏడు దశల్లోనూ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ అంశం తెరపైకి రావాలి తప్ప.. ఈలోపు రాకూడదని తెలిపింది!

ఇందులో భాగంగా... ఎన్నికల ప్రక్రియలో తొలిదశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 వరకూ ఎటూంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకూడంటూ ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అంటే.. జూన్ 1 సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిర్ట్ పోల్ ఫలితాలు వెళ్లడించేందుకు వీలుంటుందన్నమాట!

Tags:    

Similar News