టీడీపీ నేతలపై ఈసీ సీరియస్.. నోటీసులు
తాజాగా వైసీపీ నాయకులు టీడీపీయువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై పిర్యాదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీల దూకుడు పెరిగింది. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శ లు కామనే అయినా.. హద్దులు దాటి వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీలకు శాపంగా మారుతోంది. ఈ విషయం లో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలదీ అదే తీరుగా ఉంది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారులకు రోజు కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. వైసీపీపై టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ఫిర్యాదులు చేస్తుంటే.. వైసీపీ ఈ మూడు పార్టీలపై ఫిర్యాదులు చేస్తోంది.
తాజాగా వైసీపీ నాయకులు టీడీపీయువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై పిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు తీవ్ర వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ.. వైసపీ నేతలు ఆరోపించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యను సీఎం జగన్‌కు ముడిపెడుతూ.. ఆయనను దూసిస్తూ.. ఈ పోస్టులు పెట్టారనేది వైసీపీ నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ముఖేష్‌కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు.
వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ మే స్పందించిన మీనా.. టీడీపీ యువ నాయకుడికి నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోనే స్పందించాలని.. లేకపోతే.. చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. మరికొందరు నాయకులపై నా వైసీపీ ఫిర్యాదు చేసింది. కొందరు.. ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ ఇమేజ్‌నుడ్యామేజీ చేస్తున్నారని టీడీపీ ఐటీ సిబ్బందిపైనా వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల అధికారులు నోటీసులు జారీచేశారు.