వైరల్ వీడియో... ఆకాశంలో రాకెట్ పేలితే ఎలా ఉంటుందో తెలుసా?
అవును... అంతరిక్ష రంగంలో తనదైన మార్కు చూపిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు భారీ దెబ్బ తగిలిందనే చర్చ మొదలైంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన "స్పేస్ ఎక్స్" చేపట్టిన ప్రతిష్టాత్మక "స్టార్ షిప్" ప్రయోగం గురించి తెలిసిందే. ఈ సమయంలో... ఆ ప్రతిష్టాత్మక పునర్వినియోగ భారీ రాకెట్ విఫలమైంది. టెక్సస్ లోని బొకా చికా వేదిక నుంచి గురువారం దీన్ని ప్రయోగించగా.. అది భూవాతావరణంలోకి ప్రవేశించగానే పేలిపోయింది.
అవును... అంతరిక్ష రంగంలో తనదైన మార్కు చూపిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు భారీ దెబ్బ తగిలిందనే చర్చ మొదలైంది. ఈ సంస్థ ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ విఫలమైంది. దీంతో... ఈ రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.
టెక్సాస్ లోని స్టార్ బేస్ నుంచి జరిగిన ఈ ప్రయోగంలో సూపర్ హెవీ బూస్టర్ ను విజయవంతంగా ఒడిసి పట్టుకుంది కానీ.. చివరికి స్టార్ షిప్ అంతరిక్ష నౌకను మాత్రం కోల్పోయింది. అయితే.. టెస్ట్ ఫ్లైట్ సమయంలో అనేక క్లిష్టమైన విన్యాసాలను విజయవంతంగా అమలు చేయడం విశేషమైన సాంకేతిక నైపుణ్య ప్రదర్శనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ 232 అడుగుల భారీ రాకెట్ అయిన దీనిలో మొత్తం 33 రాప్టార్ ఇంజిన్లు వాడారు. ఈ సందర్భంగా స్పందించిన స్పేస్ ఎక్స్.. ప్రయోగం విఫలమైనప్పటీకీ ఇది స్టార్ షిప్ విశ్వసనీయతను పెంచిందని.. ప్రయోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సెకరించామని తెలిపారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సమయం పడుతుందన్నారు.