ఏఐ ఎఫెక్ట్: ట్రంప్-మస్క్ స్టెప్పులు.. హోరెత్తిన సోషల్ మీడియా
తాజాగా మస్క్ తన 'ఎక్స్' ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ''మమ్మల్ని విద్వేషించేవాళ్లు దీన్ని ఏఐ అని చెబుతారు'' అని వ్యాఖ్యానించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్, ఆయనకు ప్రధాన మద్దతుదారు, ప్రపంచ కుబేరు డు.. ఎలాన్ మస్క్ వీరిద్దరి గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు, ఎన్నికల విరాళాలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ట్రంప్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ట్రంప్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు.
ఇలా.. ట్రంప్-మస్క్ జోడీ ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. ట్రంప్-మస్క్ జోడీ.. ఓ పాప్ సాంగ్‌కు స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ 'బీ గీస్' బృందం స్టే ఇన్ అలైవ్ గీతానికి వీరితో స్టెప్పులు వేయించింది. దీనికి గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
దీనికి మరో జోడింపు కూడా ఆసక్తిగా మారింది. తాజాగా మస్క్ తన 'ఎక్స్' ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. ''మమ్మల్ని విద్వేషించేవాళ్లు దీన్ని ఏఐ అని చెబుతారు'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. 'మేం అదిరిపోయేలా స్టెప్పులేశామా లేదా?' అని ప్రశ్నించారు.
వాస్తవానికి ఇది ఏఐ మహిమే. కానీ, ఇది అచ్చం వారు డ్యాన్స్ చేసినట్టుగానే రూపొందించడంతో ఏఐ అని గుర్తించడం కూడా కష్టంగానే ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ వీడియోను దాదాపు 7 కోట్ల మందికిపైగా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు. 'ఇది నిజమా లేదా ఏఐ మాయేనా అన్నది గుర్తించలేకపోతున్నాం. ఓటర్ల ను ఆకర్షించేందుకు ఇది మరో కొత్త ప్రయత్నం' అంటూ అనేక మంది పోస్టు చేస్తున్నట్టు తెలిపారు.