ఫ్రెంచ్ పార్లమెంట్ పై మాక్రాన్ కీలక నిర్ణయం ..అసలు కారణం..

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు

Update: 2024-06-10 09:29 GMT

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్న మేక్రాన్ ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లుగా వెల్లడించారు. త్వరలో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించడం గమనార్హం.యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూస్తున్నట్టు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రెండు విడతల్లో జరగబోతున్న ఎన్నికల మొదటి షెడ్యూల్ జూన్ 30న , రెండవ షెడ్యూల్ జులై 7న జరగబోతున్నట్లుగా మేక్రాన్ ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు,మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు ,సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లు నమోదవుతాయని అంచనా.మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి సగం కంటే తక్కువ ఓట్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే పార్లమెంటును రద్దు చేసిన మాక్రేన్ ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.

పార్లమెంట్‌లో ఆమోద బిల్లుకు సంబంధించిన చర్చల సమయంలో ప్రభుత్వం తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంది. మైనారిటీ ప్రభుత్వంగా ఉన్న మాక్రాన్ ప్రభుత్వం వలసలలు ,పింఛన్లపై ప్రతిపాదించిన సంస్కరణల కారణంగా విపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామం వల్ల ప్రభుత్వ విధానాలు అమలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అంతేకాకుండా మాక్రేన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడం, పారదర్శకతను స్థాపించడం కారణమని పేర్కొంటున్నారు.. "ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి, పార్లమెంట్ రద్దు చేయడం ఎంతో అవసరం. కొత్త ఎన్నికల ద్వారా ప్రజలకు తమ ప్రతినిధులను సరికొత్త శక్తితో ఎన్నుకునే అవకాశం లభిస్తుంది ," అని మాక్రేన్ తన పేర్కొన్నారు.

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఫ్రాన్స్‌ ప్రజల మనసులో కన్ఫ్యూషన్ పెంచుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యులను ఎంచుకుంటారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యక ఎన్నికలుగా ఈయూ ఎన్నికలు గుర్తించబడతాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 720 మంది ప్రతినిధులను యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నుకోవడం కోసం 40 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కావు.. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే ప్రభుత్వాన్నే కాక యూరోపియన్ యూనియన్ తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. వలసలు, రక్షణ, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు పై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని అంచనా. అంతే కాదు చైనా, అమెరికా వంటి దేశాలతో యూరోపియన్ యూనియన్ అవలంబించే దౌత్య సంబంధాలపై కూడా ఈ ఎన్నికల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది.

Tags:    

Similar News