బీజేపీలో హరీష్ చేరికను ఈటల సంగం కన్ఫాం చేసినట్లేనా?
ఇక ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల సంగతి సరేసరి. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా సున్నాకు పరిమితమైపోయింది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆరెస్స్ పరిస్థితి దయణీయంగా మారిపోయిన సంగతి తెలిసిందే! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే కాలక్రమేణా ఆ సంతోషం కూడా లేకుండా పోతోందని అంటున్నారు.
అయితే అనంతరం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యలో.. ఆయన బీఆరెస్స్ నేతల కోసం తలుపులు బార్లా తెరిచారనే చర్చ బలంగా వినిపించింది. ఆ చర్చను నిజం చేస్తూ బీఆరెస్స్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొవడం మొదలుపెట్టారు. ఇటీవల ఒకేసారి ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల సంగతి సరేసరి. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా సున్నాకు పరిమితమైపోయింది. ఈ సమయంలో హరీష్ రావు సైతం బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై ఈటల రాజేందర్ ఆల్ మోస్ట్ క్లారిటీ ఇచ్చేశారు!!
అవును... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ పరిస్థితి అత్యంత దయణీయంగా మారిపోయిందని అంటున్న వేళ.. బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేటీఆర్, హరీష్ లు హస్తినలో అదేపనిలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ కలయికకు దక్షిణాదిలోని బీజేపీ కీలక నేతలు అడ్డుతగులుతున్నరనే ప్రచారం జరుగుతుంది.
ఈ పరిస్థితుల్లో... బీఆరెస్స్ తో దోస్తీకి బీజేపీ నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో... తనదారి తాను చూసుకుని, తాను మాత్రం బీజేపీలో చేరిపోయే ఆలోచనలో హరీష్ రావు ఉన్నారని, ప్రస్తుతం ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నరని, ఈ మేరకు హస్తినలో కాషాయ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది.
ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై తెలంగాణలో ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఇందులో భాగంగా... బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు! ఇదే సమయంలో... రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.. అయితే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కామెంట్ చేయలేనని ఈటల అన్నారు. దీంతో... ఈ విషయంపై సంగం క్లారిటీ వచ్చినట్లే అని అంటున్నారు పరిశీలకులు.