పెళ్లి తర్వాత శృం*గారం పట్ల ఆసక్తి తగ్గకూడదంటే...?
భార్యభర్తల మధ్య అనుబంధం మరింత దృఢపడటానికి శృం*గారం కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
భార్యభర్తల మధ్య అనుబంధం మరింత దృఢపడటానికి శృం*గారం కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ఉన్నప్పుడు భాగస్వాముల మధ్య ఆనందం ఉంటుంది. అయితే... దాదాపు ప్రతి జంటా పెళ్లైన కొత్తలో శృంగా*రంపై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకరి ఆసక్తిని ఒకరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే వారు ఒకరి వ్యక్తిత్వం గురించి మరొకరు కూడా పరోక్షంగా తెలుసుకుంటారని సె*క్స్ నిపుణులు చెబుతుంటారు. ఇదే సమయంలో వీలైనప్పుడల్లా ఈ కార్యక్రమానికి సంబంధించి పరోక్ష, ప్రత్యక్ష చర్చలు కూడా సాగిస్తుంటారని చెబుతుంటారు. అయితే... కాలక్రమేణా శృంగారంపై కోరికను పలు జంటలు తొందరగా కోల్పోతుంటుంటుంటాయి.
వివాహం అయిన కొత్తలో ఉన్న ఉత్సాహం క్రమక్రమేపీ తగ్గుతూ ఇంకా వయసు ఉండగానే, తన భాగస్వామికి కోరికలు ఉన్నా కూడా అవతలివారికి తగ్గిపోతుంటాయి!. అయితే దీనికి ఒకటి కాదు చాలానే కారణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. అవేమిటనేది ఇప్పుడు చూద్దాం!
వాస్తవానికి వివాహానికి ముందు స్త్రీ పురుషులిద్దరికీ శృం*గారానికి సంబంధించి ఎవరి ఫాంటసీ వరల్డ్ వారికి ఉంటుంది. అయితే చాలా మందికి వివాహం అనంతరం వారి ఊహా ప్రపంచానికి పూర్తి భిన్నంగా వాస్తవ ప్రపంచం ఉంటుంది. సె*క్స్ లో అసంతృప్తి మొదలవ్వడానికి ఇది మొదటి కారణం అని నిపుణులు చెబుతుంటారు.
ఇదే క్రమంలో పెళ్లిముందు గంటలు తరబడి ప్రేమ కబుర్లు మాత్రమే చెప్పుకునే స్త్రీపురుషులు.. భార్యభర్తలుగా మారిన అనంతరం వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ సమయంలో కొన్ని గొడవలు ఎవరో ఒకరి సారీ తో ప్రశాంతంగా ముగించుకుంటే.. మరికొన్ని మాత్రం తీవ్రరూపం దాల్చి ఇద్దరి మధ్యా గోడలకు దారి తీస్తుంటాయి.
ఇలా చిన్నగా మొదలైన కొన్ని గొడవలు మనసుల మధ్య, మనుషుల మధ్య గోడ కట్టిన సందర్భాల్లో అది పూర్తిగా వారి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంటుంది. ఈ సమయంలోనే ఒకరితో ఒకరు శృం*గారంలో పాల్గొనాలనే ఆసక్తిని కోల్పోతారు.
ఇదే క్రమంలో ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవితంలో రకరకాల ఒత్తిడిలు కలుగుతున్నాయి. ప్రధానంగా ఆఫీసులో పని ఒత్తిడి అయినా, ఇంటి పనుల్లో ఒత్తిడి అయినా... ఇది కూడా ఓ రకంగా వారి లైంగిక జీవితాలను ప్రభావితం చేస్తుంటుంది. ఈ ఒత్తిడిని నియంత్రించుకోని పక్షంలో భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాల పట్ల ఆసక్తిని క్రమంగా కోల్పోతారు!
ఇక దంపతుల మధ్య లైంగికపరమైన గ్యాప్ కు మరో ప్రధానకారణంగా అనుమానం కూడా ఉంది! జీవిత భాగస్వామిపై అనుమానం ఉంటే అది కచ్చితంగా పెను సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా భార్యాభర్తల మధ్య సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఏదైనా అనుమానం మొదలైంతే వీలైనంత వరకూ ఆదిలోనే నివృత్తి చేసుకోవడం అన్ని విధాలా మంచిది.
ఇక వీటితో పాటు కొన్నిసార్లు శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కూడా దంపతుల మధ్య ఈ గ్యాప్ కు కారణం అవుతుంటుంది. ఫలితంగా ఇది సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. అయితే... దీనికి వైద్యపరంగా చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇలా దంపతుల మధ్య కాలక్రమేపీ సెక్స్ పట్ల పలు కారణాల వల్ల ఆసక్తి కోల్పోతుండటం జరుగుతుంటుంది. పైన చెప్పుకున్న సమస్యలు వస్తున్నాయని తెలిసినా, ఇప్పటికే వచ్చి ఉన్నా కాస్త శ్రద్ధ వహిస్తే, సమస్యలను పరిష్కరించుకుని, సందేహాలను నివృత్తి చేసుకుంటే వారి సెక్స్ జీవితం అందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.