జగన్ తెలంగాణ సీఎం అయ్యి ఉంటే... టి.కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో టి.కాంగ్రెస్ నేత మహ్మద్ ఫిరోజ్ ఖాన్.. రాయలసీమలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

Update: 2024-03-13 03:54 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ రాయలసీమలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకోవడంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పైగా సీమలో తనకు ఎదురైన అనుభవం... బాంబులు విసరడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీమ స్టైల్లో దక్కిన ప్రశంసల గురించి ఫిరోజ్ ఖాన్ చెప్పిన విధానం కూడా ఆసక్తిగా మారిందని అంటున్నారు.

అవును... తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో టి.కాంగ్రెస్ నేత మహ్మద్ ఫిరోజ్ ఖాన్.. రాయలసీమలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తన స్నేహితుడు జేసీ పవన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని.. తనకు డిగ్రీ పూర్తయిన తర్వాత రాయలసీమకు వెళ్లినట్లు చెప్పిన ఫిరోజ్ ఖాన్... నాడు జేసీ దివాకర్ రెడ్డి ప్రచార వాహనంలో తానూ ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఆపోజిట్ తెలుగుదేశం అభ్యర్థి నాగిరెడ్డి ర్యాలీ వస్తుందని తెలిపారు.

ఆ సమయంలో ఆపోజిషన్ పార్టీ నుంచి అటాక్ జరిగితే దివాకర్ రెడ్డి వద్ద ఉన్న 20మంది ఉరికిపోయారని.. ఆ సమయంలో అక్కడే ఒక ప్లాస్టిక్ బకెట్ లో ఉన్న బాంబులను తీసి.. క్రికెట్ బాల్ త్రో చేసినట్లుగా అవతలి వర్గంపై విసరడం మొదలుపెట్టానని తెలిపారు. అనంతరం తాడిపత్రికి రాగానే జేసీ దివాకర్ రెడ్డి భార్య తనను చెడామడా తిట్టారని తెలిపారు. తనను కూడా సొంత కొడుకులా వారు చూస్తారని అన్నారు.

అనంతరం హీరో అవుతాననుకుంటే ఇలా తిట్టి కుర్చోబెట్టారెంటని ఫీలవుతున్న అనంతరం... టోటల్ తాడిపత్రి తనను "అన్నా హీరో, అన్నా పులి, అన్నా టైగర్" అని ప్రశంసలతో ముచ్చెత్తారని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు.

వైఎస్ జగన్ వెరీ గుడ్!:

ఇదే సమయంలో తన క్లాస్ మెట్ అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో అద్భుతంగా పరిపాలిస్తున్నారని టి.కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కితాబిచ్చారు. అయితే ఏపీకి ఉన్న సమస్య ఏమిటంటే... అక్కడ ఫండ్స్ లేకపోవడం అని.. జగన్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇండియా నెంబర్ వన్ సీఎం అయ్యేవారని వెల్లడించారు.

ఇదే క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా ఏపీలో తిరిగి జగనే అధికారంలోకి వస్తారని అన్నారు ఫిరోజ్ ఖాన్. టీడీపీ, బీజేపీ, పవన్ కల్యాణ్ మొదలైన పార్టీలన్నీ కలిసిన గెలిచే అవకాశం లేదని తెలిపారు.

Tags:    

Similar News