ప్రపంచంలోనే ఇది హ్యాపీయెస్ట్ కంట్రీ... భారత్ స్థానం కాస్త మెరుగే కానీ..!

దానికి కారణం ప్రధానంగా... పని ఒత్తిడి, తెలియని అసంతృప్తి, అర్థంకాని ఆందోళన అని చెబుతుంటారు.;

Update: 2025-03-20 06:58 GMT

ఈ ప్రపంచంలో మనిషికి అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నా.. భూతల స్వర్గంగా కొంతమంది పరిస్థితి ఉంటున్నా.. చేతి నిండా డబ్బులు, సకల సౌకర్యాలు ఉంటున్నా.. సంతోషంగా ఉండలేకపోతున్నాడని అంటున్నారు. దానికి కారణం ప్రధానంగా... పని ఒత్తిడి, తెలియని అసంతృప్తి, అర్థంకాని ఆందోళన అని చెబుతుంటారు.

అందుకే మనిషిలో మనస్ఫూర్తిగా నవ్వుకునే భాగ్యం కూడా కరువై.. పార్కుల్లో లాఫింగ్ క్లబ్బుల్లో చేరి ఆర్టిఫిషియల్ ఆనందాన్ని చూపిస్తున్నారని అంటున్నారు. అయితే... ఒక దేశంలో మాత్రం ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఫలితంగా... ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఆ దేశం వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలిచింది.

అవును... ప్రపంచంలో మనస్ఫూర్తిగా సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా, ఆందోళన లేకుండా ఉన్న మనుషుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుందని చెబుతోన్న తరుణంలో... ఒక దేశం మాత్రం నిత్యం ఆనందంలో మునిగితేలుతోంది. ఫలితంగా... ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల్లో ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దాని పేరే... ఫిన్లాండ్!

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ (మార్చి 20) ని పురస్కరించుకొని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్... వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - 2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో మరోసారి, వరుసగా ఎనిమిదోసారి ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ సంపాదించుకొంది. దీని తర్వాత స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఐస్ లాండ్, స్వీడన్ దేశాలున్నాయి.

ఈ జాబితాలో గత ఏడాది 126వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది జాబితాలో మాత్రం కాస్త మెరుగుపడి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక పక్కనున్న చైనా.. 68వ స్థానంలో కొనసాగుతుండగా.. దాయాదీ పాకిస్థాన్ 109వ స్థానంలో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉందని నివేదిక పేర్కొంది. ఇక పెద్దన్న అమెరికా 12ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 24వ స్థానంలో నిలిచింది.

టాప్ 10 హ్యాపీయెస్ట్ కంట్రీస్!:

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్ ల్యాండ్

4. స్వీడన్

5. నెదర్లాండ్స్

6. కోస్టారికా

7. నార్వే

8. ఇజ్రాయెల్

9. లక్సెంబర్

10. మెక్సికో

కాగా... కేవలం సంపద, వృద్ధినే పరిగణలోకి తీసుకోకుండా... మనుషుల మధ్య సంబంధాలు, నమ్మకాలు, ఆత్మ సంతృప్తి, లైఫ్ స్టైల్, సేచ్ఛ, దాతృత్వం, అవినీతి మొదలైన అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. దీంతో... అమెరికా 24వ స్థానంలోనూ నిలిచింది. కారణం... అమెరికాలో సుమారు 53% మంది గత రెండు దశాబ్ధాలుగా ఒంటరిగానే భోజనం చేస్తున్నారంట.

ఇక తాలిబన్ల పాలనలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూ, భూమిపై నరకం చూస్తోన్న ప్రాంతంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆఫ్గానిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగన నిలవగా... హమాస్ తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈ జాబితాలో ఇజ్రాయెల్ 8వ స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News