పిల్లల కడుపు నింపేందుకు తమ కడుపు మాడ్చుకుని.. కెనడాలో కష్టాలు

కెనడాలో అందమైన బాల్యం అందరికీ సాధ్యం కావడం లేదట. కారణం.. పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడమే.

Update: 2024-11-23 14:30 GMT

కెనడా అంటే.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. అన్నిరకాల వనరులతో డెవలప్ అయిన దేశం. ప్రశాంతతకు మారు పేరు.. అన్నిటికి మించి అగ్ర రాజ్యం అమెరికాకు క్లోజ్ ఫ్రెండ్.. అమెరికా ఎంత చెబితే కెనడాకు అంత. అత్యంత పొడవైన సరిహద్దును పంచుకుంటూ కూడా అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించడం కెనడాకే సాధ్యమైంది. అయితే, కొన్నాళ్లుగా కెనడా వార్తల్లో నిలుస్తోంది. భారత్ మూలాలున్న ఖలిస్థానీల హడావుడి.. అక్కడ ఖలిస్థానీల హత్య ఉదంతాలు.. భారత దౌత్యవేత్తల బహిష్కరణ.. దీనికి దీటుగా భారత్ స్పందించడం.. అనేక అంశాల్లో ఇరు దేశాల సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరాయి.

భారతీయుల రెండో డెస్టినేషన్

కెనడాలో రాజకీయాలు సహా అనేక రంగాల్లో భారతీయుల ముద్ర చెరిగిపోనింది. కెనడా చట్టసభల్లో ప్రవాసులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం సహా ఇంకా చాలా విషయాల్లో కెనడియన్ల కంటే భారతీయులదే ప్రధాన పాత్ర. ఇటీవలి సంక్షోభం మినహాయిస్తే రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలే ఉన్నాయనేందుకు కెనడాలో మన వారు పోషిస్తున్న పాత్రనే నిదర్శనం. కాగా, రెండు నెలల కిందట పార్ట్ టైమ్ జాబ్ కోసం కెనడాలో కొందరు యువకులు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ భారతీయ విద్యార్థే ఈ వీడియో తీశారు.

అందరినీ ఆహ్వానించే దేశమే..

విస్తీర్ణం రీత్యా అత్యంత పెద్ద దేశమైన కెనడా వలసలో విషయంలోనూ ఉదారంగా ఉండేది. ఎప్పుడో 200-300 ఏళ్ల కిందట పంజాబీ సిక్కులు కెనడా వెళ్లి స్థిరపడిపోయారు. అలానే అనేక దేశాల వారూ కెనడాను తమ శాశ్వత స్థావరంగా చేసుకున్నారు. ఇటీవల కాస్త కఠినం చేశారు కానీ.. ఒకప్పుడు కెనడా వలసదారుల స్వర్గధామం. అయితే, ఈ దేశంకొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం, ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుదలతో కెనడియన్లు సతమతం అవుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు రోజువారీ అవసరాలు కూడా తీరడం లేదట.

పిల్లలు.. పస్తులు

కెనడాలో అందమైన బాల్యం అందరికీ సాధ్యం కావడం లేదట. కారణం.. పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడమే. ద్రవ్యోల్బణం, , నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఈ పరిస్థితి తలెత్తుతోందట. సాల్వేషన్‌ ఆర్మీ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నట్లు స్పష్టమైంది. ఏకంగా 90 శాతంపైగా కుటుంబాలు కిరాణం వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

ప్రతి నలుగురిలో ఒకరు..

కెనడాలో నివసించే ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి తాము తినే ఆహారాన్ని తగ్గించుకుంటున్నారట. 90 శాతం మంది పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతల కోసం కిరాణం ఖర్చులు తగ్గిస్తున్నట్లు తేలింది. కెనడాలో ఆహార బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు స్పష్టమైంది. కాగా, భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని నిర్ణయించాయి. చాలామందికి నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి దొరకడం లేదట. డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకొంటున్నారని తేలింది. అదీ కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది సర్వేలో చెప్పారు.

Tags:    

Similar News