బాబు ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రతినిధులు... లిస్ట్ ఇదే!

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.

Update: 2024-06-12 10:53 GMT

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈయనతోపాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈయనతోపాటు పలువురు విదేశీ ప్రతినిధులు హాజరవ్వడం గమనార్హం.

అవును... కృష్ణాజిల్లా గన్నవరం మండలం, కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిద రంగాలకు చెందిన వారు అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా... కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టీస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.

వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు హీరో నిఖిల్, డైరెక్టర్ క్రిష్ హాజరయ్యారు. ఇదే సమయంలో... ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు విదేశీ అతిథులు హాజరయ్యారు. ఇందులో భాగంగా... సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రతినిథులు ఉన్నారు.

సెంథిల్ తొండమాన్ (గవర్నర్‌, ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ - శ్రీలంక)

ఎడ్గర్‌ పాంగ్‌ (సింగపూర్‌ కాన్సులేట్ జనరల్‌ - చెన్నై)

గారెత్ విన్ ఒవెన్ (బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ - హైదరాబాద్‌)

సిలాయ్‌ జకీ (ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్‌)

చాంగ్‌ న్యూన్‌ కిమ్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా కాన్సులేట్ జనరల్‌ - చెన్నై)

టకహషి మునియో (జపాన్‌ కాన్సులేట్ జనరల్‌ - చెన్నై)

థియర్రీ బెర్త్‌ లాట్ (ఫ్రాన్స్‌ కాన్సులేట్ జనరల్‌ - బెంగళూరు)

మహ్మద్‌ అరిఫుర్ రెహమాన్‌ (బంగ్లాదేశ్‌ డిప్యూటీ కాన్సులేట్ జనరల్‌ - చెన్నై)

ఇవోట్‌ డెవిత్‌ (నెదర్లాండ్స్‌ కాన్సులేట్ జనరల్‌ - ముంబై)

జెన్నిఫర్‌ అడ్రియానా లార్సన్‌ (యూఎస్‌ కాన్సులేట్ జనరల్‌ - హైదరాబాద్‌)

మహదీ షారోఖీ (కాన్సులేట్ జనరల్‌ ఆఫ్‌ ఇరాన్‌ - హైదరాబాద్‌)

Tags:    

Similar News