టెస్లా కార్ క్రాష్ లో నలుగురు భారతీయులు మృతి.. వీడియో!

అవును... కెనడాలోని టొరంటో సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా.. డివైడర్ ను ఢీకొట్టింది.

Update: 2024-10-25 12:51 GMT

సాంకేతికతకు, భద్రతకు మారు పేరని చెప్పే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కారు క్రాష్ అయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందులో భాగంగా... తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అవ్వడంతో భారతదేశానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీఇకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

అవును... కెనడాలోని టొరంటో సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా.. డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో... ఆ మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు భారతీయులు మరణించారు. అయితే.. అది సెల్ఫ్ డ్రైవింగ్ మోడలా కాదా అనేది తెలియాల్సి ఉంది.

గురువారం బ్రాంప్టన్ లో బస చేసిన ఈ బృందం.. రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. మరణించిన వారిలో గుజరాత్ లోని గోద్రాకు చెందిన కేతాబా గోహిల్ (30), నిల్ రాజ్ గోహిల్ (26) తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో కేతాబా, నిల్ లు తోబుట్టువులు!

కేతబా గోహిల్ ఆరెళ్ల క్రితం కెనడాకు వెళ్లి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేశారు. ఇక నీల్ రాజ్ జనవరిలో అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో వారు కూడా మరణించారని అంటున్నారు. ఈ సమయంలో... ఓ మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... కారులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల మహిళ కారు నుంచి బయటకు వచ్చి వాహనదారుల సాయం కోరినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాప్రాయం లేదని తెలుస్తోంది. కారులో మంటలు రాగానే అద్దాలు పగలగొట్టేందూ ప్రయత్నించామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు!

కాగా... ఈ ఏడాది జూలైలో జరిగిన ఘటనలో పంజాబ్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వారు ప్రయాణిస్తున్న కారు హైవేపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు!

Full View
Tags:    

Similar News