టాక్స్  పేయర్  పర్మిషన్ లేకుండా ఉచిత హామీలు...వాస్తవం ఎంత?

ఎన్నికల సమయం లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల కు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు పలువురు వాటాదారులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ఇటీవల సిఫార్సు చేసింది!

Update: 2023-08-01 05:01 GMT

గతకొంతకాలంగా ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు ఉచితాలను వాడుకోవడం పై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పన్ను చెల్లింపుదారుల కు సంబంధించిన ఆల్-ఇండియా ఆర్గనైజేషన్‌ ఒకటి ఉందని, దీనికి సుప్రీం అనుమతి కూడా ఉందని వస్తోన్న వాదనల్లో మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

అవును... ఎన్నికల సమయం లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల కు సంబంధించిన అంశాల ను పరిశీలించేందుకు పలువురు వాటాదారులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు గతం లో సిఫార్సు చేసిన విషయం వాస్తవమే! అయితే... సోషల్ మీడియా లో సర్క్యులేట్ అవుతున్నట్లు దానికి సంబంధించిన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అయితే ధృవీకరించలేదని అంటున్నారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక విషయం సర్క్యులేట్ అవుతోందని తెలుస్తోంది. "ఏ ప్రభుత్వం పాలించినా, టాక్స్ పేయర్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆమోదం లేకుండా.. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, రుణమాఫీ వంటి పథకాల ను ఏ ప్రభుత్వమూ ప్రకటించలేదు" అని ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో... "డబ్బు మా పన్ను చెల్లింపుల కు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి" అనేది డిమాండ్ అని అంటున్నారు. ఈ క్రమంలో... ఎన్నికల సమయం లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల కు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు పలువురు వాటాదారులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ఇటీవల సిఫార్సు చేసింది!

అయినప్పటికీ... అందుకు సంబంధించిన అధికారాలు, పరిమితులను మాత్రం సుప్రీంకోర్టు ఇంకా ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ సమయంలో రాజకీయ పార్టీల ఉచిత పంపిణీకి సంబంధించి దాఖలైన పిటిషన్లలో చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని, అన్ని వాటాదారుల ప్రతినిధులతో నిపుణుల సంస్థను ఏర్పాటు చేయడం సముచితమని భావిస్తున్నట్లు సుప్రీం తేల్చిందని తెలుస్తోంది.

ఇదే సమయంలో పన్నుచెల్లింపుదారుల ఆల్-ఇండియా ఆర్గనైజేషన్‌ ని సూచించడం గురించి కూడా ఎటువంటి నివేదికలు పేర్కొనలేదని తెలుస్తోంది. దీంతో... ఎన్నికల ఉచితాల కు సంబంధించిన అంశాల పై సలహా ఇచ్చే కమిటీని సుప్రీంకోర్టు సిఫారసు చేసినప్పటికీ, అటువంటి కమిటీ ఆమోదం లేకుండా ఎన్నికల ఉచితాలను అమలు చేయడం సాధ్యం కాదని మాత్రం ఇంకా పేర్కొనలేదు!

Tags:    

Similar News