కొత్త అప్ డేట్... గన్నవరం విమానాశ్రయానికి రామోజీ పేరు?

నేపథ్యంలో "రామోజీరావు విమానాశ్రయం - గన్నవరం" అని.. "రామోజీ - గుడివాడ నియోజకవర్గం" అని త్వరలో బోర్డులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Update: 2024-08-20 06:02 GMT

ప్రస్తుతం ఏపీలోని టీడీపీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తనకూ రామోజీరావుకూ ఉన్న బంధానికి ఆయన మరణానంతరం ఓ సంస్మరణ సభ ఏర్పాటు చేయడమో, ఓ లైబ్రరీ నిర్మించి వదలడమో కాదు.. అంతకు మించి ఇంకా ఏదో చేయాలని చంద్రబాబు తపిస్తున్నారట. ఈ నేపాథ్యంలో ఆయన రెండు ఆలోచనలు చేసారని.. అందులో ఒకటి కన్ఫాం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అవును... టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు - దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 కాలంలో నందమూరి తారకరామారావు కోసం అహర్నిశలు పనిచేశారనే పేరు సంపాదించుకున్న రామోజీ.. తదనంతరకాలంలో చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు రావడంలోనూ కీలక భూమిక పోషించారనే కామెంట్లను సొంతం చేసుకున్నారని అంటుంటారు!

ఇక తదనంతరం చంద్రబాబుకు ఆయనకూ మధ్య బంధం విడదీయరాని స్థాయికి చేరుకుందని అంటారు. అందుకు గల అసలు కారణం ఏపైనప్పటికీ... చంద్రబాబు-రామోజీ బంధం విడదీయలేనంత బలంగా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే 2014 సమయంలో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ‘ఈనాడు’ కీలక భూమిక పోషించిందని అంటారు.

ఇక టీడీపీకి లైఫ్ అండ్ డెత్ గా చెప్పిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఈనాడు’ పోషించిన పాత్ర ‘న భూతో న భవిష్యతీ’ అనే చెప్పుకోవాలి. మరోపక్క ఇటీవల రామోజీ మరణించిన సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పాడె మోసి ఆయనతో తనకున్న బంధాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. ఆత్మీయ బంధువుకు అంతిమయాత్ర వరకూ తోడెళ్లారు!

ఆ సంగతి అలా ఉంటే... రామోజీరావు రుణం మరింత బలంగా తీర్చుకోవాలని బాబు భావిస్తున్నారనే చర్చ ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలో బాబు ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో... గుడివాడ నియోజకవర్గానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో "రామోజీరావు విమానాశ్రయం - గన్నవరం" అని.. "రామోజీ - గుడివాడ నియోజకవర్గం" అని త్వరలో బోర్డులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. విమానాశ్రయం విషయంలో పూర్తి స్పష్టత లేకపోయినా.. గుడివాడ ప్రాంతానికి మాత్రం రామోజీ పేరు ఆల్ మోస్ట్ ఫిక్సని అంటున్నారు. మరి చంద్రబాబు వీటిలో ఏ రూపంలో రామోజీ రుణం తీరుచుకుంటారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News